Templates by BIGtheme NET
Home >> Telugu News >> ధోని రిటైర్మెంట్ వెనుక ఇంకో ఆశ్చర్యపోయే నిజం!

ధోని రిటైర్మెంట్ వెనుక ఇంకో ఆశ్చర్యపోయే నిజం!


Facts behind Dhoni Retirement

Facts behind Dhoni Retirement

భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన టీమిండియా మాజీ కెప్టెన్ – క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకొని ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. అండగా నిలిచినందుకు దన్యవాదాలు 19:29 గంటల నుండి నన్ను రిటైర్డ్ గా భావిస్తారు” అని ధోని పోస్టు పెట్టారు. ధోని సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. ధోనీ ప్రకటన వెనుక కీలక కారణం ఉందని తేలింది.

ధోని చివరిసారిగా 2019 ప్రపంచ కప్ లో భారత్ తరపున ఆడాడు. జూలైలో న్యూజిలాండ్ తో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచే అతని నిర్ణయానికి కారణమని అంటున్నారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ లో భారత్ 19.29కి న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సందర్భాన్ని ప్రస్తావించేలా ధోని సరిగ్గా ఏడాది ఆ టైంకి రిటైర్మెంట్ ప్రకటించారని అంటున్నారు.

మరోవైపు – ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే మరో యువ క్రికెటర్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై పలకడం వెనుక ఇంకో కారణం ఉందంటున్నారు. ధోని – రైనా జెర్సీ నెంబర్లు 7 – 3. ఈ రెండింటిని కలిపితే 73 అవుతుంది. ఈ రెండింటికీ మరో ముఖ్యమైన అంశం ఆగస్టు 15 – 2020 నాటికి భారత్ 73 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని 74వ ఏటలో అడుగుపెట్టింది. అందుకే వీరిద్దరూ వీడ్కోలు పలికారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇదిలాఉండగా ధోనీ సతీమణి సాక్షిసింగ్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. దేశం గర్వపడేలా ధోనీ ఎన్నో విజయాలు అందించారని సాక్షి ఇన్ స్టాలో పేర్కొన్నారు. మీరు సాధించిన విజయాలు చూసి గర్వంగా ఉంది. రిటైర్మెంట్ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలు చూసి నేను గర్విస్తున్నాను. మీకు ఇష్టమైన ఆటకు గుడ్ బై చెప్పే క్రమంలో పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకుని రిటైర్మెంట్ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా – ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు – చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ వాళ్లకు మీరు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు అని సాక్షి పేర్కొన్నారు.