భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

కరోనా అనుమానితుల మాయలు ఇన్నిన్ని కాదయా

0

కరోనాపై భారత ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో తీవ్ర ఇబ్బంది ఒకటి ఎదురవుతోంది. అది విదేశాల నుంచి వస్తున్నవారు – వచ్చినవారు అస్సలు సహకరించకపోవడం. విమానాశ్రయాల్లో థర్మల్ స్కానర్లకు దొరక్కుండా కొందరు పారాసిటమాల్ మాత్రలు మింగి వెళ్తున్నారు. దీంతో స్కానింగ్ సమయంలో బాడీ టెంపరేచర్ నార్మల్ గానే రికార్డవుతోంది. మరికొందరు స్కానింగ్ లో దొరికినా ఇల్లలో ఉంటామని అధికారులను రిక్వెస్ట్ చేసి వెళ్లి ఇచ్చిన మాట తప్పుతున్నారు. దీంతో అలాంటివారిలో కరోనా పాజిటివ్ ఉన్నవారి వల్ల కమ్యూనిటీలో మిగతావారికి సోకుతోంది.

ఇంకో పెద్ద సమస్యా ఉంది. అది తప్పుడు వివరాలు ఇవ్వడం. విమానాశ్రయం నుంచి వచ్చినప్పుడు తప్పుడు చిరునామాలు ఇస్తున్నారు. దీంతో వారిని ట్రేస్ చేయడం కష్టమవుతోంది. సింగపూర్ నుంచి వచ్చిన ఓ మహిళ అలాగే తప్పుడు చిరునామా ఇచ్చి తప్పించుకుంది. గల్ప్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ఇలాగే తప్పుడు చిరునామా ఇచ్చాడు.. ఇప్పుడాయన కోసం అధికారులు వెతుకుతున్నారు. అలాగే విదేశాల నుంచ వచ్చిన ముగ్గురు చందానగర్ లోని తమ ఇళ్లలోనే ఉంటామని చెప్పి ఏకంగా అక్కడి నుంచి మకాం మార్చేశారు.

ఇక మరికొన్ని చోట్ల స్థానికులు తమ ప్రాంతంలోని అనుమానితులను అక్కడే క్వారంటీన్ లో ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మెదక్లో అరబ్ గల్లీలో ఇలాగే జరిగింది. ఇలా క్వారంటీన్ ప్రొటోకాల్ పాటించకుండా కరోనా అనుమానితులు నిబంధనలు ఉల్లంఘిస్తుండడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువవుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-