రాగిబిందెల్లో నగనట్రా: పొలం తవ్వుతుండగా లంకెబిందెలు లభ్యం

0

పొలం తవ్వుతుండగా ఓ రైతుకు లంకెబిందెలు లభించాయి. ఆరు రాగి కుండలు కనిపించగా ఆ కుండల్లో బంగారు వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో జరిగింది. అయితే గుప్త నిధులు లభించాయని ఆ నోటా ఈ నోటా పాకి చివరకు రెవెన్యూ అధికారులకు తెలిసింది. దీంతో ఆ రైతు నుంచి ఆ కుండలతో పాటు ఆభరణాలన్ని తమ వెంట తీసుకెళ్లారు. అవి తమ పూర్వీకులు దాపెట్టి ఉంటారని ఆ రైతు చెబుతున్నాడు.

వికారాబాద్ జిల్లా సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన సిద్దిఖీ యాకుబ్ అలీ తమ పొలంలో దున్నుతున్నారు. ఈ సమయంలో చిన్నపాటి (గురిగి అంటారు) ఆరు రాగి పాత్రలు కనిపించాయి. మట్టిలో కలిసిపోయి ఉన్న వాటిని బయటకు తీశారు. ఆ కుండల్లో బంగారు నాణేలు ఆభరణాలు వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ విషయం ఊరు ఊరంతా హాట్ టాపిక్గా మారింది. దీంతో చివరకు రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారంతా గ్రామానికి చేరుకుని విచారణ చేశారు. యాకుడ్ అలీ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొరికిన వాటిని పరిశీలిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. అవి వారి పూర్వీకులవేననే ఆధారం లభిస్తే ఆ కుటుంబసభ్యులకు ఆభరణాలు అప్పగిస్తారు. లేదంటే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోనుంది.
Please Read Disclaimer