డిపోలపై దండెత్తిన మహిళా కండక్టర్లు

0

కక్కు వచ్చినా కాన్పు వచ్చినా ఆగదంటారు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఉన్న మహిళా కండక్టర్ల పరిస్థితి అలాగే తయారైంది. పాపం వీరంతా డ్యూటీలో చేరుతామంటూ వస్తున్నా కేసీఆర్ సర్కారు డిపోల్లో చేర్చుకోని పరిస్థితి ఎదురైంది. దీంతో తమను చేర్చుకోవాలంటూ తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా తెలంగాణ వ్యాప్తంగా మహిళా కండక్టర్లు డిపోలకు క్యూ కట్టారు. తాము డ్యూటీ చేస్తామంటూ ఆందోళన చేశారు. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు కొనసాగించారు. మహిళా కార్మికుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఇద్దరు మహిళలకు గాయలయ్యాయి. ఆస్పత్రుల పాలయ్యారు. శారద అనే మహిళ పరిస్థితి విషమంగా తయారైంది.

ఇలా మొన్నటివరకు కేసీఆర్ కోరినా ఇదే మహిళా కార్మికులు చేరలేదు.. పట్టువీడలేదు. ఇప్పుడు చేరుదామని ఆందోళన చేస్తున్నా కేసీఆర్ సర్కారు చేర్చుకోవడం లేదు. దీంతో సహనం నశించిన మహిళా కండక్టర్లు డిపోలపై దండెత్తారు. ఆ ఘర్షణలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది.

ఇలా తెలంగాణ ఆర్టీసీ సమ్మె హింసాత్మకం వైపు దారితీసింది.ఇప్పటికైనా కేసీఆర్ పట్టువీడి ఆర్టీసీ కార్మికులను దరిచేరనీయకపోతే దారుణాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Please Read Disclaimer