గ్రహణం రోజున ప్రెగ్నెంట్స్ వీటిని అస్సలు తినొద్దు..

0

ప్రెగ్నెంట్స్ ఇంట్లోనే ఉండాలని, సూర్య గ్రహణాన్ని చూడకూడదని చెబుతారు. ఎందుకంటే, సూర్య గ్రహణం సమయంలో బాడీలో హార్మోనల్ ఛేంజెస్ జరిగి, యాంగ్జయిటీ పెరుగుతుందని అంటారు. అలాగే గర్భవతులు ఈ సమయంలో పదునైన వస్తువులు పట్టుకోవద్దని, స్నానం చేయకూడదని, అలా చేస్తే పుట్టే బిడ్డ లోపాలతో పుడతాడని అంటారు. సూర్య గ్రహణ సమయంలో ప్రెగ్నెంట్స్ ఇంకా ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో చూడండి.

​1. తేలికైన హెల్దీ ఫుడ్..

గ్రహణ సమయంలో ఆకలిగా నీరసంగా అనిపిస్తే తేలిగ్గా జీర్ణమయ్యే పండ్లు తీసుకోవచ్చు. అవి తినేటప్పుడు కూడా తులసి ఆకులతో కలిపి తీసుకుంటే ఎలాంటి దోషం ఉండదని అంటారు. తులసిలోని గొప్ప గుణాలు కూడా మేలు చేస్తాయి. కాబట్టి కచ్చితంగా ఈ టిప్‌ని పాటించండి.

​2. కొబ్బరి నీరు..

ప్రెగ్నెంట్స్ ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండాలి. అందుకోసం ఈ సమయంలో కొబ్బరి నీరు తీసుకోవడం ఎంతో మంచిది. అందుకే హ్యాపీగా కొబ్బరి నీరు తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు, తల్లీబిడ్డ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి గ్రహణ సమయంలో తీసుకోవచ్చు.

​3. వండిన ఆహారానికి దూరం..

చాలా మందికి ఉన్న నమ్మకాల ప్రకారంగా ఈ సమయం లో వండిన ఆహారం తినకూడదు. పచ్చి కూరలతో చేసిన సలాడ్ తినొచ్చు. అరటిపండు, యాపిల్, దానిమ్మ వంటివి హాయిగా తినచ్చు. అందుకే వండినవి కాకుండా పండ్లు, రసాలు తసుకోకండి..

​4. నాన్-వెజ్ ఫుడ్ వద్దు..

ఈ సమయం లో ప్రెగ్నెంట్స్ నాన్-వెజ్ ఫుడ్ తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయం లో వాతావరణం లో జరిగే అనేక మార్పుల వల్ల వండిన ఆహారంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నాన్‌వెజ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

​5. నీరు ఎక్కువగా తీసుకోండి..

సూర్య గ్రహణ సమయంలో నీరసం రాకుండా ఉండటానికి గర్భవతులు నీరు ఎక్కువగా తాగాలి. లేదా కడుపులో ఉన్న బిడ్డకి హాని జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువగా నీరు తీసుకోండి.. నీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావు కాబట్టి.. హ్యాపీగా తీసుకోవచ్చు.

​6. ఊరగాయలు మంచివే..

గ్రహణ సమయం లో ఊరగాయలు పాడైపోతాయని అంటారు. కానీ, మెడిక సైన్స్ ప్రకారం ఊరగాయలు పారెయ్యక్కర్లేదు, వాటిని తినడం సురక్షితమే. ప్రెగ్నెంట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఊరగాయలు తినచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కరి సాంప్రదాయంలో ఒక్కో విధంగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని తీసుకోవచ్చు.
Please Read Disclaimer