పార్టీ బలహీనమవడానికి కారణం పవన్ కళ్యాణ్… మాజీ నేత సంచలన వాఖ్యలు

0

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ ఎంతటి దారుణమైన ఓటమిని కూడగట్టుకుందో మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేయగా కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకుంది అంటే అదెంత దారుణమైన దుస్తితో అర్థం చేసుకోవచ్చు. కాగా జనసేన పార్టీ అంతటి దారుణమైన ఓటమిని కూడగట్టుకోడానికి కారణం కేవలం అధినేత అని ఇటీవలే పార్టీ వీడిన సీనియర్ నేత వాఖ్యానించారు. పార్టీలో సరైన ఆదరణ లేక, అధినేత ప్రవర్తన సరిగా లేని కారణంగానే పార్టీ వీడుతున్నానని మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి వెల్లడించారు.

అయితే పార్థసారథి జనసేన పార్టీలో ఉన్నంత కాలం కూడా సఖ్యంగానే ఉంటూ, ఇపుడు పార్టీ వీడాక సాక్ష్యాత్తు జనసేన అధినేతపై ఇలాంటి వాఖ్యలు చేయడం అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఈమేరకు మాట్లాడిన పార్థసారథి కొన్ని కీలకమైన అంశాలను వెల్లడించారు. జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికే 6 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ పార్టీ నిర్మాణం జరగలేదని, దీనికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ పార్థసారథి ఆరోపించారు. అంతేకాకుండా కుటుంబ రాజకీయాలకు అతీతుడిని అని చెప్పుకుంటూనే తన సోదరుడు నాగబాబుకు టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మారాలని లేకపోతె తొందర్లోనే జనసేన పార్టీ అంతమైపోతుందని పార్థసారథి అంటున్నారు.




Please Read Disclaimer