ఎంత పే..ద్ద.. తాచు పామో, దీన్ని చూస్తేనే సగం ప్రాణాలు పోతాయ్!

0

ఈ పాము కాటు వేయక్కర్లేదు, దీన్ని చూస్తేనే సగం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దక్షిణ థాయ్‌ల్యాండ్‌లోని మురుగు కాలువలో తిరుగుతున్న ఈ తాచు పామును రెస్క్యూ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం బ్యాంకాక్ సమీపంలోని అడవుల నుంచి హౌసింగ్ ఎస్టేట్‌లోకి చొరబడిన ఈ పాము ఓ మురుగు కాలువలోకి వెళ్లింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు.

గత మూడు రోజులుగా ఈ పామును పట్టుకోడానికి ఏడుగురు రెస్క్యూ సిబ్బంది చెమటోడ్చారు. ఎట్టకేలకు మంగళవారం దీన్ని పట్టుకోగలిగారు. మురుగు కాలువ నుంచి డ్రైనేజీ పైపులోకి వెళ్లిన ఆ పామును సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి.. వెంటాడి మరీ పట్టుకున్నారు. దాని తోక పట్టుకుని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. నీటిలో ఉండటం వల్ల అది పట్టుతప్పింది. ఎట్టకేలకు రెండో ప్రయత్నంలో దాన్ని పట్టుకోగలిగారు. ఈ పాము నాలుగు మీటర్లు (13 అడుగులు) పొడవు, 15 కిలోల బరువు ఉందని తెలిపారు. థాయ్‌లాండ్‌లో ఇప్పటివరకు పట్టుకున్న పాముల్లో మూడో అత్యంత పొడవైనదని తెలిపారు.

వీడియో:




Please Read Disclaimer