శుభవార్త: తిరుమల లడ్డు ఇక ఫ్రీగా!

0

తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులందరికీ లడ్డును ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది టీటీడీ. ఇప్పటి వరకూ నడక దారిన వెళ్లే భక్తులకు అది కూడా కాలి నడకన వెళ్లి- దర్శనం టోకెన్ పొందిన భక్తులకు మాత్రమే ఉచిత లడ్డు ఇచ్చే సంప్రదాయం ఉండేది. ప్రతి రోజూ ఇరవై వేల మందికి ఆ తరహాలో ఉచిత లడ్డు ప్రసాదం లభించేది. దాంతో పాటుకు కొనుగోలు చేస్తే తక్కువ ధరకే అదనపు లడ్లు ఇచ్చే వారు.

అయితే ఇక నుంచి కాలి నడకన కాకున్నా శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. జనవరి ఆరో తేదీ నుంచి ఈ నియమాన్ని అమలు చేయనున్నారని తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీని ప్రారంభించనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.

రోజుకు కనీసం ఎనభై వేల మంది భక్తులకు ఇలా ఉచిత లడ్డును ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక అదనంగా లడ్డుల ఇవ్వడం మామూలుగానే కొనసాగనుంది. నూతన సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ స్వాగతించగల నూతన నిర్ణయాలను తీసుకుంది.
Please Read Disclaimer