గౌరీ లంకేష్ హత్య కేసులో భారీ ట్విస్ట్

0

కర్ణాటకలో ప్రముఖ హేతువాదిగా పేరుగాంచిన నరేంద్ర దభోల్కర్ ను హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శరద్ కలాస్కర్ విచారణలో నమ్మలేని వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. తాజా విచారణలో దభోల్కర్ ను తాను తుపాకీతో కాల్చానని ఒప్పుకున్న శరద్ మరో హేతువాది గోవింద్ పన్సారే తోపాటు ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యలతోనూ సంబంధం ఉన్నాయన్న నిజాలను వెల్లడించాడు. 14 పేజీల పోలీస్ స్టేట్ మెంట్ లో సంచలన విషయాలు వెలుగుచూసాయి.

*కేసు పూర్వపరాలు ఇవీ..

2013 ఆగస్టులో ప్రముఖ హేతువాది అయిన నరేంద్ర దభోల్కర్ ఫుణేలో మార్నింగ్ వాక్ కు వచ్చిన హత్య ఆయన్ని చేశారు. ఇక ఫిబ్రవరి 2015లో కూడా మరో ప్రముఖ హేతవాది అయిన గోవింద్ పన్సారేని హత్య చేశారు. మహారాష్ట్రలోని పాల్ గఢ్ లో పోలీసులు దాడులు చేయగా ఓ పిస్తోలు ఉత్పత్తి కేంద్రం శరద్ దొరికాడు. ఈ రెండు హత్యల్లో కూడా నిందితులు శరద్ కలాస్కర్ ప్రమేయం ఉందని అరెస్ట్ చేయగా.. తుపాకీతో ఇతడే చంపాడని నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో చార్జిషీట్ లో పోలీసులు నమోదు చేశారు. హిందూ అతివాద సంస్థలు తనను కలిసి భావజాలాన్ని వివరించి ఆయుధాలు తయారీ – బాంబుల తయారీ నేర్పారని హేతువాదులను హతమార్చాలని చెప్పినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. శరద్ వెనుక విరాంధ్ర తావ్డే ఉన్నాడని తెలిసి ఆయనను సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది.

*2016లో గౌరీలంకేష్ హత్యకు ప్లాన్.. అమలు..

2017లో కర్ణాటకలోని బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు – హేతవాది అయిన గౌరీ లంకేష్ హత్య కూడా జరిగింది. అంతకుముందే 2016లో బెల్గాంలో సమావేశంలో హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని చంపాలని డిసైడ్ అయినట్టు శరద్ పోలీసుల విచారణలో తెలిపాడట.. ఈ మేరకు గౌరీ లంకేష్ హత్యకు ప్రణాళికకు సిద్ధం చేసి బాధ్యతలను అప్పగించాడు. అనంతరం సెప్టెంబర్ లో గౌరిలంకేష్ ను హత్య చేశారు. ఇలా గౌరీలంకేష్ హత్యకు జరిగిన మాస్టర్ ప్లాన్ ను వెల్లడించిన నిందితుడు శరద్ కీలక సమాచారాన్ని పోలీసులకు వివరించాడు. అయితే ఈ హత్యలో అతడు భాగస్వామ్యం అయ్యాడా లేదా అన్నది తెలియరాలేదు. మొత్తంగా హిందుత్వ వాదులే గౌరీలంకేష్ సహా ప్రముఖ హేతువాదులను చంపినట్టు తేలింది.