అరే అబ్బాయిలు మీకు ఇక పండగే …

0

పెళ్లి .. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే అతి ముఖ్యమైన పండుగ. కొందరి జీవితాల్లో అంతకంటే ఎక్కువ సార్లే రావచ్చు ..ఆ విషయం పక్కన పడితే. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో అత్యంత కీలక ఘట్టం. ఈ పెళ్లి పై ఎన్నో కలలు కంటుంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లి తరువాత జరగాల్సిన చాలా కార్యాలు పెళ్ళికి ముందే జరిగిపోతున్నాయి. కలికాలం కదా అని అందరూ అలా సర్దుకుపోతున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలంటే వయస్సు చాలా ముఖ్యమైంది. పెళ్లి వయస్సు వచ్చిన తరువాతే ..తమ పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తారు.

గతంలో బాల్య వివాహాలు చేసేవారు. కానీ కాలంలో వచ్చిన మార్పులతో ఈ మధ్య కాలంలో బాల్య వివాహాలు చాలా వరకు తగ్గిపోయాయి. కానీ ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. 2006 బాల్య వివాహాల నియంత్రణ చట్టం ప్రకారం అబ్బాయిలకు 21 ఏళ్లు – అమ్మాయిలకు 18 ఏళ్లు పూర్తయితేనే పెళ్లి చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంది.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇకపై అబ్బాయిలు కూడా ఎంచెక్కా 18 ఏళ్లకే పెళ్లి పీటలు ఎక్కేయొచ్చు. అబ్బాయిల పెళ్లి వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంబించింది. కేంద్ర మహిళా – శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న జరిగిన అంతర్గత సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం. అందరి నిర్ణయాలని సేకరించి అతి త్వరలో దీనిపై కేంద్రం ఒక ప్రకటన చేయబోతుంది అని తెలుస్తుంది. ఏదేమైనా ఇక పై అబ్బాయిలు కూడా 18 ఏళ్లకే పెళ్లి చేసుకొని ..ఆ అనుభూతిని పొందవచ్చు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home