సెక్స్ కోసం భార్య డిమాండ్..భర్త ఏం చేశాడంటే?

0

శృంగారం కోసం పరితపించిన భార్య.. బ్రహ్మచర్యం అంటూ తప్పించుకున్న భర్త.. శృంగారం కావాలని అడుగుతున్నా భర్త పట్టించుకోకపోవడంతో ఆ భార్య పోలీసులను ఆశ్రయించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో సంచలనమైంది.

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మహిళకు మహిళకు 2016లో వివాహమైంది. వీరికి 2018లో ఓ బిడ్డ జన్మించాడు. సాఫీగా సాగుతున్న వారి వ్యవహారంలో బిడ్డ పుట్టాక మహిళను దూరం పెట్టాడు భర్త.. శృంగారంలో పాల్గొందామని ఎంత బలవంతపెట్టినా.. ప్రేరేపించినా భర్త దూరం పెడుతూనే పోయాడు. ఎందుకు రావడం లేదని అడిగితే బ్రహ్మచర్యం తీసుకున్నానంటూ సమాధానం చెప్పేవాడు. భార్య నిలదీస్తే దారుణంగా కొట్టాడు. అత్తా మామ కూడా ఇలా బలవంతపెట్టినందుకు ఆ కోడలిని చితకబాదారు.

దీంతో విసిగి వేసారిన భార్య ‘తను శృంగారం పాల్గొనమని ఎప్పుడూ అడిగినా భర్త పారిపోతున్నాడని.. న్యాయం చేయాలని’ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అరుదైన వింతైన కేసును ఎలా డీల్ చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారట.. అయితే ఊరంతా అప్పులు చేసి తప్పించుకు తిరుగుతున్న ఆమె భర్త భయంతోనే ఇలా దూరంగా జరిగాడని పోలీసుల విచారణలో తేలిందట..
Please Read Disclaimer