అంతరిక్షం లోకి మన ‘గుంటూరు అమ్మాయి’.. ఇండియా నుండి రెండో మహిళ !

0

శిరీష బండ్ల .. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో మారుమోగిపోతుంది. దీనికి కారణం ఆమె త్వరలోనే అంతరిక్షయానం కి సిద్ధం అవుతోంది. గుంటూరు కి చెందిన ఈ అమ్మాయి అమెరికాలోని వర్జిన్ గెలాక్సిన్ స్పేస్ వీఎస్ ఎస్ యూనిటీ నుంచి అంతరిక్షయానం చేయబోతుంది. 4 ఏళ్ల నుండే హూస్టన్ లో పెరిగిన ఈ 34 ఏళ్ళ యువతి తన కల నిజం కానుందని తాను ముందే ఊహించానని తెలిపింది. వ్యోమగామి 004 గా ఈమెను ఈ మిషన్ లో పేర్కొంటున్నారు. శబ్దానికి సుమారు మూడున్నర రెట్లు వేగంగా ప్రయాణించగల స్పేస్ క్రాఫ్ట్ లో వర్జిన్ గెలాక్టిక్ ఫౌండర్ అయిన రిచర్డ్ బ్రాన్ సన్ తోను మరో నలుగురితోనూ కలిసి ఈ మిషన్ లో ఈమె పాల్గొంటోంది. ఇండియా నుంచి అంతరిక్షయానం చేస్తున్న రెండో మహిళ కానుంది. 2003 లో కొలంబియా స్పేస్ షటిల్ డిజాస్టర్ లో ఇండియాకే చెందిన నాసా వ్యోమగామి కల్పనా చావ్లా మరణించిన విషయం తెలిసిందే.

తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ వింగ్ కమాండర్ గా రిటైర్ అయ్యారు.అమెరికాలోని బ్రిటిష్-అమెరికన్ స్పేస్ ఫ్లైట్ కంపెనీలో గవర్నమెంట్ ఎఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ గా 2015 లోనే నియమితురాలైన శిరీష చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నట్టు తెలిపింది. ఈమె తండ్రి డా. మురళీధర్ బండ్ల యూఎస్ లో రీసెర్చర్ గా పని చేస్తున్నారు. కాగా ఇక 70 ఏళ్ళ రిచర్డ్ బ్రాన్ సన్ కూడా ఇటీజ్ టైం టు టర్న్ మై డ్రీమ్ ఇంటూ రియాలిటీ అని పేర్కొన్నారు. తన 71 వ జన్మ దినానికి వారం రోజులముందే ఆయన తన సొంత స్పేస్ ప్లేన్ లో రోదసియానం చేయనున్నాడు. వర్జిన్ గెలాక్సిక్ చీఫ్ బెత్ మోసెస్ లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కొలిన్ బెనెట్ శిరీష బండ్లతో బాటు మరో ఇద్దరు పైలట్లతో బ్రాన్ సన్ వ్యోమగామి అవుతున్నాడు. ఈయన బ్రిటిష్ బిలియనీర్ కూడా అంతరిక్షంలో మరో అయిదుగురు ఎస్ట్రోనట్లను ఈ బృందం కలుస్తుంది. ఇలా ఉండగా ఈ నెల 20 న అమెజాన్ బ్లూఆరిజన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా తన న్యూ షెఫర్డ్ రాకెట్ లో రోదసి యానం చేయనున్నాడు.

శిరీష బండ్ల.. అచ్చ తెలుగమ్మాయి. పదహారాణాల గుంటూరు అమ్మాయి. స్వస్థలం తెనాలి. ఆమె పూర్వీకులు అమెరికాలో స్థిరపడ్డారు. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కీలకమైన వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తోన్నారు. అమెరికాలోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఆమె పని చేస్తోన్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని. మైక్రోగ్రావిటీ సబ్జెక్ట్లో ఆమె నిష్ణాతురాలు. రిచర్డ్ బ్రాస్నన్ టీమ్లో సెలెక్ట్ కావడం పట్ల ఆమె ఆనందానికి హద్దుల్లేవు. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్.. తన అంతరిక్ష ప్రయాణ తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఆయన స్పేస్లోకి వెళ్లనున్నారు. ఆయన కంటే.. తాను అక్కడ అడుగు పెట్టాలనే లక్ష్యంతో రిచర్డ్ బ్రాస్నన్ ఈ ప్రాజెక్ట్ను ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకున్నారు. అంతరిక్షంలోకి తాను వెళ్లాలనేది తల్లి చిరకాల వాంఛ అని.. దాన్ని తాను నెరవేర్చబోతోన్నందుకు ఉద్విగ్నంగా ఉందంటూ రిచర్డ్ బ్రాస్నన్ కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు.