రాజ్యసభలో జీవీఎల్ తెలుగులో.. చీప్ ట్రిక్సా..?

0

ఆంధ్ర ప్రదేశ్ ను ఉద్ధరించాలని భారతీయ జనతా పార్టీ నేతలకు ఏమైనా ఉంటే… అది రాష్ట్రానికి నిధుల కేటాయింపు ద్వారా – రాష్ట్రానికి తాము ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా జరగాలి. ఈ ఎన్నికలకు ముందు ముందు ఎన్నికలప్పుడే ఏపీకి ప్రత్యేకహోదా హామీని ఇచ్చారు. కేంద్రంలో వరసగా రెండో సారి అధికారంలోకి వచ్చి కూడా కమలనాథులు ఆ హామీని నిలుపుకోవడం లేదు.

ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా విషయంలో ఎన్నో ఆశలతో ఉన్నా పోరుబాట పట్టినా ప్రస్తుత ప్రభుత్వం హోదా కావాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా కమలనాథులకు అది పట్టడం లేదు. ప్రత్యేకహోదా ఇవ్వాలనే ఆలోచనే చేయడం లేదు కమలనాథులు.

అది తాము ఇచ్చిన ఎన్నికల హామీనే అయినా.. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అంటూ బీజేపీ వాళ్లు నిర్భీతిగా ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి ప్రకటనలతో ప్రజలను మరింత రెచ్చగొడుతూ ఉన్నారు.
రాష్ట్ర విభజనకు మద్దతు పలికినది భారతీయ జనతా పార్టీ తమకు అధికారం దక్కితే ఐదేళ్లు కాదు పది పదిహేనేళ్లు హోదా ఇస్తామంటూ హామీలు ఇచ్చింది బీజేపీ వాళ్లు. తీరా ఇప్పుడు ఆ విషయంలో బీజేపీ జాతీయ రాష్ట్ర నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు.

ఇక రాష్ట్రానికి ఇతర ఫండ్స్ తీసుకురావడంలో కూడా ఏపీ బీజేపీ నేతలు ఎలాంటి శ్రద్ధా చూపడం లేదు. ఎంతసేపూ అధిష్టానం భజనే సరిపోతూ ఉంది. అయితే ఇలా రాష్ట్రానికి సాయపడే అంశాలను వదిలేసి..రాజ్యసభలో తెలుగులో మాట్లాడేసి ఏదో క్రెడిట్ పొందాలని – ఏపీలో ఏదో సెంటిమెంట్లు రేపాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకు నిదర్శనమే ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో తెలుగులో ప్రసంగించడం!

అయితే తెలుగు వాళ్లు అలాంటి ఉత్తుత్తి సెంటిమెంట్లకు పడిపోయే వారు కాదు ఉత్తరాది తరహా రాజకీయాలు ఇక్కడ నడవవు .. రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తేనే బీజేపీకి ఏపీలో భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ నేతలు గ్రహించాలని సామాన్య ప్రజానీకం వ్యాఖ్యానిస్తూ ఉంది.
Please Read Disclaimer