కాకినాడ కుర్రోడికి టీమిండియా టెస్టు జట్టులో చోటు

0

ప్రపంచ కప్ తర్వాత వెస్టిండిస్ పర్యటనకు వెళుతోన్న భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఆదివారం ఎంపీక చేసింది. ఈ జట్టులో తెలుగు కుర్రాడికి చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన హనుమ విహారీ జట్టులోకి ఎంపికయ్యాడు. ఓ తెలుగు తేజానికి చోటు రావడంతో తెలుగు ప్రజలందరూ హర్షిస్తున్నారు. కాకినాడకు చెందిన విహారి ప్రస్తుతం ఆంధ్రా రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

విహారీ గతంలో కూడా భారత టెస్ట్ జట్టుకు ప్రాథినిత్యం వహించాడు. 2018-19 సీజన్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో ఆడిన విహారీ సిడ్నీ మ్యాచ్ లో 42 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్ సిరీస్లోనూ జట్టుతో పర్యటించాడు. అయితే భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా సెలక్టర్లు మాత్రం విహారిపై విశ్వాసం ఉంచారు.

ఇక విహారి అటు బ్యాటింగ్ తో పాటు ఆఫ్ స్పిన్నర్. చురుకైన ఫీల్డర్ కూడా. విహారీ భారీ ఇన్నింగ్స్ లు ఆడకపోయినా సెలక్టర్లు అతడిపై విశ్వాసం ఉంచారు. కెరీర్ లో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడిన హనుమ విహారి 132 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇండియన్ టెస్ట్ టీంలో అజారుద్దీన్ తర్వాత ఆఫ్ స్పిన్నర్ వెంకటపతిరాజు – వీవీఎస్.లక్ష్మణ్ – అంబటి రాయుడు తర్వాత హనుమ విహారీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు
Please Read Disclaimer