బూట్లతో కొట్టుకుంటూ వైసీపీ పై ఫైర్ అయిన వైసీపీ వీరాభిమాని !

0

సాధారణంగా ఒక పార్టీ అభిమానులు ..ఇంకో పార్టీ నేతలని అధినేతలనే తిడుతూ పోస్టులు పెట్టడం ఇతర పార్టీ నేతలు మాపై దాడి చేసారు అని చెప్పడం సర్వ సాధారణం. కానీ తాజాగా ఏపీలో దీనికి వ్యతిరేకంగా ఒక సంఘటన జరిగింది. ప్రస్తుతంలో ఏపీలో జగన్ సర్కార్ పాలన కొనసాగిస్తుంది. తాజాగా వైఎస్ కుటుంబానికి విధేయుడు…వీరాభిమాని అయినటువంటి ఒక దివ్యాంగుడు ..వైసీపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఇంతకీ ఏమైంది అంటే ? పూర్తి వివరాలు చూద్దాం ..

మెడలో బూట్లు వేసుకొని నడుముకు గోనెసంచి చుట్టుకొని ఉన్న ఈయన పేరు రాజమాణిక్యం. రాజమాణిక్యంది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కె. పట్నం. పుట్టుకతోనే దివ్యాంగుడు కావడంతో తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి. తొలినుంచీ వైఎస్ అంటే అభిమానం. అ అభిమానంతోనే ఆయన చనిపోయినప్పుడు ఇల్లు అమ్మి గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటుచేశాడు. వైఎస్ కుటుంబంపై అభిమానంతో జగన్ సీఎం అయ్యేంత వరకు జుట్టు గడ్డం తీయకుండా ఆరు సంవత్సరాలపాటు అలాగే ఉన్నాడు.

కానీ ఇప్పుడు ఒకింత నిరాశ నిప్పులు కక్కుతున్నాడు. జగన్ సీఎం అయ్యేదాకా జుట్టు తీయనని గడ్డం చేయనని భీష్మించిన వీరాభిమాని.. అలాంటి అభిమానే సర్కారుపై మండిపడ్డాడట. మెడలోని బూట్లతో తనను తాను కొట్టుకొంటూ సోమవారం చిత్తూరు జి ల్లా కేంద్రంలో జరిగిన ‘స్పందన’లో పాల్గొని హల్ చల్ చేసాడు.

వికలాంగుల పింఛను తెల్ల రేషన్కార్డుకు అర్హుడినైనా.. మండల వైసీపీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి చెబితేనే ఇస్తామని తహసీల్దార్ చెబుతున్నారని తెలిపాడు . దళితుడినైన తనను అధికారులు పట్టించుకోవడం లేదన్నాడు. పార్టీ అభిమానమూ ఈ విషయంలో కొరగానిదైపోయిందన్నారు. పార్టీ గెలుపుకోసం పనిచేశానని ఒకసారి అధికారంలోకి రాగానే కొత్త కొత్త నాయకులు వైసీపీలోకి రావడం మొదలుపెట్టారని రాజమాణిక్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer