ఫ్రెండ్స్‌కు తన సెక్స్ వీడియో పంపిన బాలికపై కోర్టు సీరియస్.. అసెంబ్లీకి లేఖ!

0

16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో సెక్స్ చేయడమే కాకుండా ఆ వీడియోను తన స్నేహితులకు షేర్ చేసి చిక్కుల్లో పడింది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మేరీల్యాండ్ అత్యున్నత కోర్టు బుధవారం కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆమె స్నేహితులతో షేర్ చేసుకున్న వీడియో తనదే అయినా.. ‘సెక్స్‌టింగ్’ (సెక్స్ వీడియోలను పంపడం) నేరంగా భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

ఏం జరిగింది?: 2016, అక్టోబరు నెలలో ఆ బాలిక తన ప్రియుడితో సెక్స్‌లో పాల్గోంది. ఈ సందర్భంగా ఆ వీడియోను తన ఇద్దరి స్నేహితుల గ్రూప్‌లో షేర్ చేసింది. ఒక నిమిషం నిడివి గల ఆ వీడియో చూసి స్నేహితులు ఆశ్చర్యపోయారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహితులను విడిచిపెట్టింది. దీంతో ఆ వీడియో బయటకు వచ్చింది. అది ఆమె స్కూల్‌లోని విద్యార్థులకు సైతం చేరింది.

కొంతమంది విద్యార్థులు ఆ వీడియోను తమ స్కూల్ రిసోర్స్ ఆఫీసర్‌కు చూపించారు. దీంతో వారు కేసు నమోదు చేసి బాలికను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసు కోర్టును సందిగ్ధంలో పడేసింది. మైనర్లు తమ ఇష్ట ప్రకారం సెక్స్ చేస్తే నేరం కాదని, దాన్ని వీడియో తీసుకుని షేర్ చేసుకుంటేనే తప్పని పేర్కొంది. ఇది చైల్డ్ పోర్నోగ్రఫీ (చిన్నారులపై అశ్లీల వీడియోల చిత్రీకరణ) కిందకు వస్తుందని తెలిపింది.

ఈ వీడియో షేర్ చేసిన బాలిక కూడా మైనర్ కావడం వల్ల చిన్నారుల కిందకే వస్తుందన్నారు. పైగా, ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఆమె అనే విషయం వీక్షకులకు తెలియదని, దీంతో వారు చైల్డ్ పోర్న్ వీడియోగానే భావిస్తారని తెలిపింది. ఈ నేపథ్యంలో బాలిక చేసిన నేరం ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ కిందకు వస్తుందని కోర్టు వెల్లడించింది.

భవిష్యత్తులో చిన్నారులెవరూ ఇలాంటి చర్యకు పాల్పడకుండా ఉండటానికి ఇదే తగిన తీర్పని వెల్లడించింది. ఈ కేసుపై కోర్టు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. మేరీల్యాండ్ జనరల్ అసెంబ్లీ పరిశీలన కోసం 35 పేజీల లేఖ పంపింది. ఇది చిన్నారుల భవిష్యత్తుతో ముడిపడి ఉందని, ఈ కేసును ఆధారంగా చేసుకుని చట్టంలో మార్పులు చేయాలని సూచించింది.

పోలీసులు ఈ కేసులో ఆమెను సెక్స్ అపరాధి‌గా గుర్తించకపోవడం గమనార్హం. అలాగే, ఈ కేసును జువెనైల్ కోర్టు (బాల నేరగాళ్లను విచారించే కోర్టు) విచారించిన నేపథ్యంలో ఆమెకు పెద్దగా శిక్ష కూడా పడలేదు. మే 2017 నుంచి ఆమెను కొన్నాళ్లు నిఘా ఉంచారు. 18 ఏళ్లు దాటకుండానే చిన్నారులు ఇలా సెక్స్‌లో పాల్గోవడం, ఆ వీడియోలను స్నేహితులకు పంచడం వంటివి చేపట్టడాన్ని కోర్టు నేరంగానే పరిగణిస్తోంది. అయితే, తమ సొంత వీడియోలను ఇతరులకు పంపే చిన్నారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చట్టంలో స్పష్టత లేదు. ఈ కేసును అలా వదిలిస్తే.. ఇలాంటి వీడియోలను చూసి మిగతా చిన్నారులు కూడా అదే పనికి పాల్పడతారని, అది వారి భవిష్యత్తుకే ప్రమాదకరమని కోర్టు భావిస్తోంది. అయితే, దీనిపై మేరీల్యాండ్ అసెంబ్లీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Please Read Disclaimer