శోభనం తర్వాత మాట మార్చిన భర్త.. ఉదయాన్నే షాకిచ్చిన భార్య

0

ఓ జంటకు పెళ్లయింది. శోభనం సమయం రానే వచ్చింది. ఇద్దరూ ఏకాంతంగా మిగిలారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నవ వధువు.. మనసువిప్పి తన కోర్కెల చిట్టా వరుడి ముందు ఉంచింది. తాను బాగా చదువుకున్న కుటుంబం నుంచి వచ్చానని, చాలా ఆధునిక భావాలుగల యువతినని చెప్పింది. అలాగే గడ్డం, పైజమాతో తిరిగితే అందరూ తక్కువగా చూస్తారని, కాబట్టి మీరు కూడా మోడ్రన్‌గా తయారవ్వాలని కోరింది. అలాగే ఇకపై తాము ఉండేందుకు అద్భుతమైన ఓ భవంతి కావాలని తన కోర్కెల చిట్టా బయటపెట్టింది.

దీంతో భార్య చెప్పిన అన్ని కోరికలను తీర్చుతానని మాటిచ్చాడు. రేపట్నుంచి ఆధునిక పోకడలతో అద్భుతంగా జీవిద్దామని భరోసా ఇచ్చాడు. దీంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన భర్త ఎంత మండోడో అనుకొంది. ఈ ఆనందంలో వారిద్దరి శోభన రాత్రి కూడా ఆనందంగా ముగిసింది.

అయితే, శోభనం అయిపోయిన తర్వాత.. ఉదయాన్నే భార్యకు భర్త షాక్ ఇచ్చాడు. తాను ఇంతకు ముందు ఎలా ఉండేవాడినో, భవిష్యత్తులోనూ అలాగే ఉంటానని చెప్పాడు. తనకు నచ్చినట్లే జీవిస్తానని తేల్చిచెప్పాడు. శోభనం పూర్తవగానే భర్త ఇలా మాట తప్పడంతో.. ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. మాటతప్పిన మొగుడు నాకు అక్కర్లేదు అంటూ అతడిని వదిలేసింది. తర్వాత నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ భార్యాభర్తల పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు ఎక్కింది. హర్యానా రాష్ట్రంలోని ఛచ్రౌలీ పరిధిలో మాలిక్‌పూర్ ఖదార్ గ్రామంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.
Please Read Disclaimer