గుడ్ న్యూస్.. లాక్ డౌన్ వర్కవుట్ అవుతోందట

0

కరోనా వేళ.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రధాని మోడీ ప్రకటించటం తెలిసిందే. దీంతో.. దేశ వ్యాప్తంగా ఉన్నప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కోట్లాది మంది ఇళ్లకే పరిమితమైన ఈ ప్రత్యేక పరిస్థితితో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్.

ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల సంఖ్య తగ్గకున్నా.. పెరిగే విషయంలో మాత్రం మార్పు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు మరింత జాగ్రత్తగా ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షల్ని యథాతధంగా అనుసరిస్తే.. పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందంటూ చెప్పిన మాట రిలీఫ్ గా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందటం లేదన్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న ఆంక్షల్ని అమలు చేయకుంటే సామాజిక వ్యాప్తి మొదలుకావటం ఖాయమని.. అందుకే.. ప్రభుత్వాలు చెప్పినట్లు చేస్తే కరోనా తర్వాతి దశకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. దేశ వ్యాప్తంగా రోనా వైరస్ బాధితుల సంఖ్య 694కు చేరుకుంది. ఇప్పటివరకూ దీని కారణంగా మరణించిన వారి సంఖ్య పదహారుకు చేరుకుంది. మిగిలిన దేశాలతో పోలిస్తే.. మన దేశంలో వైరస్ వ్యాప్తి తీవ్రత.. మరణాల సంఖ్య తక్కువే అన్న వాదన వినిపిస్తోంది. అలా అని రిలాక్స్ కాకుండా.. మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-