సహజీవనంలో రేప్.. ప్రియుడికి హైకోర్టు బెయిల్.. ట్విస్ట్ ఇదే

0

సాధారణంగా అత్యాచారం చేశాడనే కేసులో బెయిల్ రావడానికి చాలా సమయం పడుతుంది.కానీ బాధితురాలు ఫిర్యాదు చేసినా కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

18 ఏళ్ల ఓ ప్రియుడు ప్రియురాలు కాలేజ్ మేట్స్. కొంతకాలం ముంబైలో సహజీవనం చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని వేళ ప్రియుడు వచ్చి ప్రియురాలితో ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు.. ఆ తరువాత గొడవలతో విడిపోయారు.బ్రేకప్ చెప్పుకొని ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.

అయితే తాజాగా తనపై అత్యాచారం చేశాడంటూ ప్రియుడిపై పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసింది ప్రియురాలు. పోలీసులు బాంబే హైకోర్టులో హాజరుపరచగా.. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

సహజీవనం చేసినప్పుడు బాగానే ఉండి.. విడిపోయాక రేప్ చేశాడంటూ ఫిర్యాదు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. మొదట్లోనే ఫిర్యాదు చేస్తేనే అది కేసుగా పరిగణించబడుతుందని బాధితురాలికి హైకోర్టు హితవు పలికింది.