జేఎన్ యూ పై మేమే దాడి చేసాం : హిందూ రక్షాదళ్

0

జేఎన్ యూ విద్యార్థులు అధ్యాపకుల పై జనవరి 5న ముసుగులు ధరించిన దుండగులు విచక్షణా రహితంగా దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్తో పాటు మరో 35మంది వరకు ఈ దాడిలో గాయపడ్డారు. ఈ దాడికి మీరు కారణమంటే.. మీరు కారణమంటూ.. ఏబీవీపీ వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. కాగా జేఎన్ యూ విద్యార్థులపై దాడికి హిందూ రక్షాదళ్ బాధ్యతను ప్రకటించుకుంది.

ఈ మేరకు భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ భయ్యా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జేఎన్యూ క్యాంపస్లో సంఘ విద్రోహహిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే క్యాంపస్లోకి హిందూ రక్షా దళ్ కార్యకర్తలు చొరబడి దాడి చేసినట్టు చెప్పారు. జేఎన్యూ క్యాంపస్ కమ్యూనిస్టులకు అడ్డాగా మారి పోయిందని దాన్ని తాము సహించబోమని వాళ్లు తమ మతాన్ని దేశాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. తమ మతం పట్ల వారి వైఖరి దేశ ద్రోహుల్లా ఉందని ఆరోపించారు. భవిష్యత్ లో ఇతర యూనివర్సిటీల్లోనూ ఎవరైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మరోసారి జేఎన్యూ లాంటి ఘటనలు రిపీట్ అవుతాయని కూడా హెచ్చరించారు.

మన దేశంలో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూఇక్కడే చదువుకుంటూదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని మేం సహించబోం. ఇలాంటి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే… వారికి ఇదే తరహా సమాధానం చెబుతాం. భారత మాతకు వ్యతిరేకంగా పోరాడే వారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదని అందుకే జేఎన్ యూపై దాడి చేశాం. ఆ దాడిలో పాల్గొన్నదంతా మా హిందూ రక్షా దళ్ సభ్యులే. దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాం.అని భూపేంద్ర తోమర్ అన్నారు.
Please Read Disclaimer