Templates by BIGtheme NET
Home >> Telugu News >> వైభవంగా వెలిగిన నగరంలో ఇప్పుడు ఒక్కరు కూడా లేరు! ఇంతకీ ఏమైంది?

వైభవంగా వెలిగిన నగరంలో ఇప్పుడు ఒక్కరు కూడా లేరు! ఇంతకీ ఏమైంది?


ఒకప్పుడు వైభవంగా అన్నిహంగులతో ఉన్న నగరం ఇప్పుడు వెలవెలబోతుంది. ప్రజలెవరూ లేకుండా నిర్మానుష్యంగా మారిపోయింది. విశాలమైన రోడ్లు భారీ భవంతులు ఉన్నా ఇప్పుడక్కడ మనుషులు ఎవరూ లేరు. వేలమంది ప్రజలతో నిత్యం కళకళలాడిన నగరం ఇప్పుడు నిశ్శబ్ధంగా మారిపోయింది. ఇంతకీ ఆ నగరం ఎక్కడుంది? దాని కథ ఏమిటో తెలుసుకుందాం.. తూర్పు మధ్యధరా సముద్రంలోని సైప్రస్ అనే ద్వీపంలో ఫమగుస్టా అనే నగరం ఉంది. 1970 వరకు ఈ నగరం పర్యాటక కేంద్రంగా ఉండేంది.

నిత్యం అనేకమంది ప్రజలు ఈ నగరాన్ని చూసేందుకు వచ్చేవారు. వీళ్లే కాక ఇక్కడ ఓ 40 వేల మంది జీవించేవారు. అయితే 1974లో ఈ నగరంపై టర్కీ దండయాత్రకు వచ్చింది. తన సైన్యంతో దాడి చేసింది. దీంతో ఈ ప్రాంతంలో ఉండే గ్రీస్ దేశస్థులు టర్కీ సైన్యం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఇరువర్గాలు దాడులు చేసుకొన్నాయి. మారణహోమం జరిగింది. ఇక్కడ గ్రీస్ దేశస్థులు ఎక్కువగా నివసించేవారు. దీంతో గ్రీస్ వర్సెస్ టర్కీ మధ్య తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొన్నది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరకు ఈ ప్రాంతాన్ని గ్రీస్ సైప్రస్.. టర్కిష్ సైప్రస్గా విభజించారు.

అప్పటి నుంచి వరోషా ప్రాంతం టర్కీ సైన్యం అధీనంలోకి వెళ్లింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ప్రాంతం టర్కీ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం పర్యాటకులు వచ్చి బీచ్ను చూస్తున్నారు. ఈ ప్రాంతంలో మళ్లీ ప్రజలు నివసించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అవి ఎప్పటికి నెరవేరతాయో తెలియదు. ఎంతైనా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఇలా ఒక్కరు కూడా లేని నగరం గా మారడం ఆశ్చర్యకరమే.