సరిహద్దుల్లో చైనా నుంచి భారత్ ఎలా సంరంక్షిస్తోంది?

0

భారత్-చైనా మధ్య ఘర్షణతో మరోసారి సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ తో 740 కి.మీల పొడువునా భారత్ కట్టుదిట్టంగా ఉంటుంది. ఎందుకంటే గుజరాత్ నుంచి పంజాబ్ దాకా అది మైదాన ప్రాంతం కావడంతో ఇబ్బందులు లేవు. మంచుతో హిమాలయ కొండలున్న కశ్మీర్ లో మాత్రమే పాక్ నుంచి భారత్ కు ముప్పు ఉంది. కానీ చైనాతో అలాకాదు. అంతా హిమాలయాలు.. చైనా-భారత్ ను ఆ మంచుకొండలే విడదీస్తున్నాయి. చైనాతో సరిహద్దు పొడవు ఏకంగా 3488 కి.మీలు. చైనాతో భూభాగాన్ని విడదీసేది వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ). ఇది జమ్మూకశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ల గుండా వెళ్తుంది.నిజానికి 1962లో యుద్ధం జరిగినప్పటికి భారత్ చైనాల మధ్య ఇప్పటికీ పూర్తిస్థాయిలో సరిహద్దుల నిర్ణయం జరగలేదు. కొన్ని ప్రాంతాల విషయమై ఇంకా రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అందులో ఇటీవల ఘర్షణ జరిగిన గాల్వాన్ నదీ లోయ ప్రాంతం కూడా వివాదాస్పదమైనదే.మంచుకొండల్లో చైనా సరిహద్దుల్లో కాపాలా కాయడం అంత ఈజీకాదు. దీనికోసం ఇండో-టిబెటన్ పోలీసులనే వాడుతారు. 6వేల మీటర్ల నుంచి 18వేల కిలోమీటర్ల ఎత్తున్న కొండలపై భారత సైన్యానికి అంత అవగాహన పోరాటపటిమ లేదు. ఐటీబీపీ సైన్యంలో రిక్రూట్ అయిన వారు మంచుకొండల్లో పుట్టిపెరిగి ఆరితేరిన వారే కావడంతో చైనాతో రక్షణలో వారిదే కీలక పాత్ర. ఈ ఐటీబీపీ కి చెందిన 32 బెటాలియన్ లు చైనా సరిహద్దుల్లో కాపాలాగా నియమించారు. అయితే ఈ బలగాలు సరిపోవు. దీనికి 3 రెట్ల అధికంగా దళాలను నియమించాల్సి ఉంటుందని ఆ బెటాలియన్ మాజీ అధిపతి జావిర్ చౌదరి తెలిపారు. ఇప్పటికీ చైనా సరిహద్దుల్లో భారత్ కు సరైన మౌళిక సదుపాయాలు యుద్ధ సామగ్రిని చేరేవేసే రవాణా వ్యవస్థ లేకపోవడం పెద్ద మైనస్.కానీ చైనా భారత్ తో సరిహద్దుల వరకు మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంది. భారీ హైవేలు రైలు మార్గాలు నిర్మించింది. జెట్ విమానాలు దిగేలా హైవేలను తీర్చిదిద్దింది.చైనాతో పోల్చుకుంటే భారత్ ఏమీ సరిహద్దుల్లో రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లేందుకు భారత్ సరిహద్దుల్లో సదుపాయాలే లేవని జావిర్ చౌదరి చెబుతున్నారు.

చైనా చేసుకున్న మౌలిక సదుపాయాల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు ద్వారా 12 గంటల్లోపు దళాలను పంపించగలిగే అవకాశం ఉంది. అదే పనిని భారతదేశం చేయాలంటే కొన్ని వేల వాహనాలు అవసరం అవుతాయని జావిర్ చౌదరి భారత్ యుద్ధ సామర్థ్యం గురించి చెప్పుకొచ్చాడు.ఇక చైనాతో పోల్చితే భారత రక్షణ బడ్జెట్ ఏమాత్రం లెక్కలోనే లేదు. 2009-10 మధ్యలో భారత్ 1134.05 కోట్ల రూపాయలు చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఐటీబీపీ దళానికి వెచ్చించింది. అదే 2018-19లో ఆ సంఖ్యను 6190.72 కోట్లకు పెంచింది. అయితే చైనా మాత్రం వేలకోట్లను కేటాయించి సరిహద్దుల్లో సకల సౌకర్యాలు కల్పించుకుంది. నిధుల కొరత కారణంగా భారత్ చేయలేకపోయింది. సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు రోడ్లు రైలు దాడి చేసే లక్ష్యాలు భారత్ వద్ద లేవు. ఇదే భారత్ కు చైనాకు మధ్య ఉన్న తేడా. యుద్ధం జరిగితే చైనాదే ఆధిపత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు.
Please Read Disclaimer