ఆచూకీ కనిపించడం లేదు..

0

ఆచూకీ కనిపించడం లేదు.. ఫొటోతో ఉన్న మనుషుల పత్రాలు గోడకు అంటిస్తే వింతగా చూసేవాళ్లు.. పేపర్లు టీవీల్లో ప్రసారం చేయించేవాళ్లం. కానీ ఇప్పుడు ఎంత సోషల్ మీడియా వచ్చినా.. పోలీసులు పకడ్బందీగా ఉన్నా మిస్సింగ్ కేసులు మాత్రం తెగడం లేదు.

తాజాగా తెలంగాణలో గడిచిన మే – జూన్ నెలల్లోనే 545 మంది మిస్సవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ అగ్రశ్రేణి తెలుగు దిన పత్రిక ఈ వివరాలను వెల్లడించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ మిస్సింగ్ కేసు హైదరాబాద్ దాని చుట్టుపక్కలే ఎక్కువగా ఉండడం కలవరపెడుతోంది. ఇందులో అంతా పిల్లలు- యువతులు అనుకుంటే పొరపాటే.. మధ్య వయస్కులు మహిళలు- వృద్ధులు కూడా మిస్ అవుతుండడం సంచలనంగా మారింది.

మరి వీరిని ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా.? లేక అవయవాల కోసం అమ్మేస్తున్నారా? మనుషుల అక్రమ రవాణా చేస్తున్నారా తెలియడం లేదు. కొందరిని కక్ష్యలతో డబ్బు కోసం కిడ్నాప్ లు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంతమంది రెండు నెలల్లో మిస్ అవ్వడం మాత్రం సంచలనంగా మారింది.