భార్య మీద ప్రేమతో ఓ భర్త చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

0

ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పవిత్రమైన బంధాలలో భార్య – భర్తల బంధం కూడా ఒకటి. మూడు మూళ్ళ బంధం తో ఒక్కటైనా ఈ బంధం …మట్టిలో కలిసేవరకూ అలాగే కొనసాగుతుంది. పెళ్లి తరువాత ఇద్దరూ ఒకటై జీవితాంతం కష్టసుఖాలను పంచుకుని జీవిస్తారు. భర్తకు ఏ కష్టం వచ్చినా భార్య భార్యకు ఏ సమస్య వచ్చినా భర్త అండగా ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఉన్న భార్య . భర్తల సంబంధాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ..ప్రస్తుతం భార్య – భర్తల మధ్య ఉండే బంధాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే పెళ్లి తరువాత ఎన్ని కష్టాలొచ్చినా ఒకరి చేయి ఒకరు విడవం అని ప్రమాణం చేసి – ఆ ప్రమాణాన్ని తు.చా. తప్పకుండా పాటించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటివారిలో ఒకరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ….

లీ – వ్యాన్ కు 1975లో పెళ్లయ్యింది. ఆ నాటినుండి భార్య భర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడుపుతూ వచ్చారు. చాలా త్వరగా పెళ్లి చేసుకోవడం వల్ల – వారిద్దరి మద్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఇక వీరి ప్రేమకు ప్రతిఫలంగా వీరికి ఏడుగురు సంతానం. అయితే పెళ్లి జరిగిన రోజు నుండి ఒకరిని విడిచి – మరొకరు ఉండేవారు కాదు. కానీమనం ఒకటి తలిస్తే ..దైవం మరొకటి తెలుస్తుంది అన్నట్టుగా …సైన్యంలో పనిచేస్తున్న లీ 2003లో ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కష్టమైన కూడా ఉద్యోగం ధర్మం కాబట్టి లీ ఇష్టం లేకున్నా కూడా వెళ్ళాడు. అలా అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకే ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. తాను ఎంతగానమో ప్రేమించే భార్య ఇకలేదని – అకస్మాత్తుగా చనిపోయిందనే సమాచారం అతడికి తెలిసింది. ఆ వార్త విన్న వెంటనే లీ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆ భాదని అంతా దిగమింగుకొని – ఆమెను చూసేందుకు హుటాహుటిన ఇంటికి బయల్దేరాడు లీ. కానీ ఎక్కువసేపు ఆమె ముఖాన్ని చూడలేకపోయాడు. ఆలస్యమైతే శవం పాడవుతుందనే ఉద్దేశంతో స్మశానంలో పాతిపెట్టారు. భార్యను వీడలేక లీ స్మశానంలో ఆమె సమాధి పక్కనే చాలా రోజుల పాటు నిద్రించేవాడు. నెలల తరబడి అతడు స్మశానంలో గడిపాడు. ఆ సమయంలోనే ఓ రోజు వర్షం కురవడంతో లీ ఆమె సమాధి వద్ద నిద్రపోలేకపోయాడు.

దీనితో ఎలాగైనా కూడా తన భార్య వద్దే ఉండాలన్న కోరికతో ఆమె సమాధి పక్కనే సొరంగం తవ్వి – ఆమెకు దగ్గరగా పడుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచిన తరువాత ఈ విషయం లీ పిల్లలు తెలిసి అతడికి చివాట్లు పెట్టి ఇంటికి తీసుకెళ్లారు. కానీ లీ ఆమెను వదిలి ఉండలేకపోయాడు. దాంతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్మశానంలోకి వెళ్లి ఆమె సమాధిని తవ్వి – ఆమె అస్థికలను ఓ సంచిలో వేసుకొని – వాటిని ఇంటికి తీసుకెళ్లి తన పడక గదిలో పెట్టుకుని నిద్రపోయాడు. ఆమె అస్థికలు కుళ్లిన స్థితిలో ఉండటంతో వాటిని చూడలేక మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ – సిమెంటు – జిగురు – ఇసుకల మిశ్రమంతో లీ ఓ మహిళ బొమ్మను తయారు చేశాడు. తన భార్య అస్థికలను అందులో ఉంచాడు. అప్పటి నుంచి ఆ బొమ్మనే తన భార్యగా భావిస్తూ నిద్రపోయేవాడు. ఈ విషయం తెలిసి అతడి పిల్లలు లీతో గొడవ పడ్డారు. తమ తల్లి అస్థికలను స్మశానంలోనే ఉంచాలని లేకపోతే ఆమె ఆత్మకు శాంతి కలగదని వాదించారు.

కానీ లీ అవేమి పట్టించుకోలేదు. అలాగే ఉంటే పక్కవారికి కూడా జబ్బులు వస్తాయని స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేసారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా కూడా లీ ఆమె అస్థికలను తిరిగి స్మశానం లో పెట్టడానికి ఒప్పుకోలేదు. దీనితో చేసేదేమి లేక పోలీసులు కూడా అలాగే వదిలేసారు. అయితే గత కొన్నాళ్లుగా లీ నడవలేక వీల్ ఛైర్ కు పరిమితమయ్యాడు. కానీ ఆ బొమ్మను మాత్రం వీడలేదు. ఇంకా అది అతడి వద్దే ఉంది. లీ ఆ బొమ్మను రోజూ శుభ్రం చేసి – దుస్తులు మారుస్తాడు. దానితో పాటుగా బొమ్మకి చాలా అందంగా మేకప్ కూడా వేస్తాడు. లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా భార్య బతికి ఉన్నప్పుడు మంచి దుస్తులు కొనలేకపోయా. అందుకే ఇప్పుడు ఆమె కోసం ఎన్నో కొత్త దుస్తులు తయారు చేశా. నా భార్య మృతదేహాన్ని జాగ్రత్తగా చూస్తున్నందుకు జనాలంతా నన్ను వింతగా చూస్తున్నారు. కానీ ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నా. నేను చనిపోయేవరకు ఆమె శవంతోనే నిద్రిస్తా అని తెలిపాడు. వీరి ప్రేమ కథ వింటుంటే …నిజమైన ప్రేమ కి ఇదే నిర్వచనంలా అనిపిస్తుంది కదా….
Please Read Disclaimer