వెటర్నరీ డాక్టర్ రేప్ మర్డర్.. ప్లాన్ వేసింది, ముందుగా అఘాయిత్యానికి పాల్పడింది అతడే

0

హైదరాబాద్ నగర శివారులో యువ వైద్యురాలి(26)పై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన ఘటనతో దేశమంగా ఉలిక్కిపడింది. నిర్భయ ఘటన తర్వాత మరోసారి ఈ ఘటన దేశ ప్రజలందరినీ కదిలించింది. ఆఖరి సమయంలో బాధితురాలు అనుభవించిన బాధను తలుచుకుని కన్నీరు పెట్టని గుండె లేదు. ఈ ఘటనలో పోలీసులు విడుదల చేసి రిమాండ్‌ నివేదికలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.

సామూహిక అఘాయిత్యానికి పాల్పడే సమయంలో యువతి అపస్మారక స్థితికి చేరడంతో అక్కడి నుంచి పారిపోవాలని నిందితులు భావించినట్లుగా తెలుస్తోంది. ఈ చీకట్లో తమను ఎవరైనా చూసే అవకాశముందా అని చుట్టూ ఒకటికి, రెండు సార్లు చూశారని సమాచారం. ఆ సమయంలో ఒక్కసారిగా బాధితురాలు కళ్లు తెరిచి నిందితులను తేరిపార చూడటంతో కంగారు పడి ఆమె నోరు, ముక్కు మూసేసి హత్య చేసినట్లు తెలిసింది.

పక్కా ప్లాన్‌తోనే…
నవంబర్ 27న ఉదయం 9 గంటలకు తొండుపల్లి రోడ్డు పక్కన లారీని పార్కింగ్‌ చేయొద్దంటూ పోలీసులు హెచ్చరించారు. దీంతో మహ్మద్‌ ఆరీఫ్‌ తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ టోల్‌ప్లాజా దగ్గరకు లారీని తీసుకొచ్చి అక్కడ పార్కింగ్‌ చేశాడు. సాయంత్రం 5.30 గంటలకు నలుగురూ మద్యం తాగుతున్న సమయంలో లారీ ఎడమవైపున స్కూటీని పార్కింగ్‌ చేస్తున్న వైద్యురాలిని చూసి ఏదో ఒకటి చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం నవీన్‌ స్కూటీ వెనుక టైరులో గాలి తీసేశాడు. ఆమె రాగానే మహ్మద్‌ ఆరీఫ్‌ లారీలో నుంచి దిగి సాయం చేస్తామంటూ బలవంతంగా తాళం తీసుకుని పంక్చర్‌ వేయించమంటూ శివకు ఇచ్చాడు. స్కూటీ తీసుకెళ్లిన శివ ..దుకాణం మూసేశారంటూ వెనక్కి వచ్చాడు.

ఆ తర్వాత మరో దుకాణానికి వెళ్లాలంటూ మిగిలిన ముగ్గురు సూచించడంతో శివ మళ్లీ స్కూటీని తీసుకెళ్లాడు. శివ రాక ముందే వచ్చాడని.. స్కూటీని కొద్దిదూరంలో చీకటి ప్రాంతంలో పెట్టాడంటూ నమ్మించి మహ్మద్‌ ఆరీఫ్‌ వెంటనే ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో చెన్నకేశవులు కాళ్లు, నవీన్‌ నడుం పట్టుకుని పక్కనే ఉన్న గోడ అవతలికి తీసుకెళ్లారు. హెల్ప్ హెల్ప్ అంటూ బాధితురాలు అరిచినా వాహనాల శబ్ధంలో ఎవరికీ వినిపించలేదు. దీంతో నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై ముందుగా చెన్నకేశవులు, ఆ తర్వాత మిగిలిన ముగ్గురూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

రాత్రి 11 గంటలకు వైద్యురాలి మృతదేహాన్ని లారీలోకి ఎక్కించిన కామాంధులు అందులోనే అనేకసార్లు అత్యాచారానికి పాల్పడి షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి పైవంతెన ఆగారు. మృతదేహాన్ని కిందకు దింపి నలుగురు పైవంతెన కిందకు చేరారు. మృతదేహంపై ముందు పెట్రోల్‌, ఆ తర్వాత డీజిల్‌ను మహ్మద్‌ ఆరీఫ్‌ చల్లగా శివ అగ్గిపుల్ల వెలిగించాడు. మృతదేహం పూర్తిగా కాలేవరకు ఆ నలుగురు అక్కడే ఉండి తర్వాత వెనుదిరిగారు. అఘాయిత్యానికి పాల్పడిన ప్రాంతంలోనే బాధితురాలి సెల్‌ఫోన్‌, వాచ్, పవర్‌ బ్యాంక్‌, కేబుల్‌ను నిందితులు దాచిపెట్టారు. పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.




Please Read Disclaimer