హైదరాబాద్ మరో మణిహారం.. ‘లుక్ ఈస్ట్’

0

దేశంలో ఐటీ ఇండస్ట్రీకి అత్యంత అనువైన నగరాలు రెండు. అందులో బెంగళూరు మొదటిదికాగా.. రెండోది హైదరాబాద్. దేశంలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు బెంగళూరులోనే అత్యంత అనుకూలమైన వాతావరణం ‘ఎకో సిస్టమ్’ ఉంది. అందుకే అక్కడికే మొదట విస్తరించాయి. ఆ తర్వాత హైదరాబాద్లోని మాదాపూర్- గచ్చి బౌలిలో కూడా అలాంటి వాతావరణం ఉండడం.. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఇక్కడా ఐటీ కంపెనీలువెలిశాయి. విస్తరించాయి.

*లుక్ ఈస్ట్ పాలసీ ఏర్పాటుకు కారణమిదే..
అయితే ఇప్పటివరకు నగర పశ్చిమ ప్రాంతానికే ఈ ఐటీ కంపెనీలు విస్తరించాయి. ఇక్కడ భారీగా విస్తరించడంతో ట్రాఫిక్ పెరిగిపోతోంది. ఒక్క వానపడితే నరకంలా మారింది. దాంతోపాటు ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో 38శాతం మంది ఉప్పల్ నాగోల్ ఎల్ బీ నగర్ ప్రాంతాల నుంచే నిత్యం వచ్చి వెళుతున్నారు. ప్రతీరోజు ప్రయాణం కోసం గంటల సమయం వృథా అవుతోంది. ఇక హైటెక్ సిటీ ప్రాంతంలో చదరపు అడుగుకు లీజు 75 వేలు ఉంటే.. ఉప్పల్ లో కేవలం 40-45వేలు మాత్రమే. అందుకే అన్నింటికి అనువుగా ఉన్న ఉప్పల్ ను ‘లుక్ ఈస్ట్’ పేరుతో మరో సైబర్ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం ఓ పాలసీని తీసుకురాబోతోంది.

*లుక్ ఈస్ట్ వల్ల లాభాలు
ఉప్పల్ లో – నాగోల్ ప్రాంతాల్లో ప్లాట్లు- భూములు రేట్లు తక్కువ. పైగా ఉప్పల్ పారిశ్రామిక వాడలో వందలాది ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఐటీ కంపెనీలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఐటీ కంపెనీలు ఏర్పాటైతే ట్రాఫిక్ సమస్యలు కాలుష్యం తీవ్రత తగ్గే అవకాశం ఉంది. పైగా మెట్రా కారిడార్ కూడా ఉప్పల్ కు అందుబాటులో ఉండడంతో పెద్దగా ట్రాఫిక్ సమస్యలుండవు. ఉద్యోగులు త్వరగా చేరుకోవచ్చు. అందుకే ఈ పాలసీ కింద ఉప్పల్ నాగోల్ పోచారం ప్రాంతంలో యూనిట్లు ఏర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ప్రోత్సాహకాలు అందివ్వాలని నిర్ణయించింది.

*నాలుగేళ్ల టైం..
వచ్చే నాలుగైదు సంవత్సరాల్లోనే లుక్ ఈస్ట్ పేరుతో తూర్పున ఉన్న ఉప్పల్- పోచారం- నాగోల్- ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించేందుకు రెడీ అయ్యింది. అప్పుడు ఐటీ కంపెనీలకు స్వర్గధామంగా సైబర్ ఉప్పల్ గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Please Read Disclaimer