వైఎస్ విజయమ్మ, షర్మిలకు స్పెషల్ కోర్టు నోటీసులు.. తెలంగాణ పీఎస్‌లో కేసు

0

ఏపీ సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ, సోదరి కుమార్తె షర్మిలకు హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేసింది. జనవరి 10న హాజరు కావాలని ఆదేశించింది. 2012 నాటి కేసులో కోర్టు ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ ఏర్పాటు చేశారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. పరకాల పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిలపై కేసు నమోదైంది. ఈ కేసులోనే తాజాగా సమన్లు జారీ అయ్యాయి.

వీరితోపాటు తెలంగాణ రాజకీయ నేతలు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీకి కూడా న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వీరందరూ జనవరి 10న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంటుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జనవరి 10నే జగన్ కూడా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ కేసు విచారణకు జగన్ హాజరు కావడం లేదు. దీంతో ఇప్పటికే జగన్‌కు చాలాసార్లు మినహాయింపు ఇచ్చామని.. ఈసారి ఆయన న్యాయస్థానం ముందు హాజరు కావాలని జగన్ తరఫు లాయర్లకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
Please Read Disclaimer