నా విజయానికి నేనే కారణం

0

టీం ఇండియా ఈ ప్రపంచకప్ టోర్నీలో ఓటమి లేకుండా దూసుకు పోతుంది. మరో రెండు మ్యాచ్ లు ఉండగానే సెమీస్ కు వెళ్లిన విషయం తెల్సిందే. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాట్స్ మన్స్ విఫలం అయ్యారు. ఖచ్చితంగా 300 పరుగులు సాధిస్తారని ఆశిస్తే కేవలం 268 పరుగులు మాత్రమే టీం ఇండియా చేయగలిగింది. ఈ స్కోర్ ను వెస్టిండీస్ ఈజీగానే ఛేదిస్తుందని అనిపించింది. అయితే టీం ఇండియా బౌలర్లు షమీ మరియు బూమ్రాలు వెస్టిండీస్ కు చుక్కలు చూపించరు. గత మ్యాచ్ లో హ్యాట్రిక్ తీసుకున్న షమీ ఈ మ్యాచ్ లోనూ ఏకంగా 4 వికెట్లు తీసుకుని కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మ్యాచ్ అనంతరం షమి మాట్లాడుతూ.. గత 18 నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ రోజులు చాలా భారంగా గడిచాయి. ఆ సమయంలో నేనెంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ విజయానికి క్రెడిట్ నాకే చెందుతుంది. నా విజయానికి నేనే కారణం. ఫిట్ నెస్ సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యల నుండి బయట పడేందుకు చాలా కష్టపడ్డాను. ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉన్నాను. ఏ ట్రాక్ పై అయినా ఆడగల సత్తా నాకుంది అన్నాడు.

కొన్ని నెలల క్రితం షమి భార్య హసీన్ జహాన్ మీడియా ముందుకు వచ్చి తన భర్త అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఆ సమయంలోనే షమిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేసింది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన బిసిసిఐ షమికి క్లీన్ చీట్ ఇచ్చింది. షమి కెరీర్ ముగుస్తుందని భావించారు. కాని ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రపంచకప్ లో అద్బుతమైన బౌలింగ్ తో జట్టుకు మధురమైన విజయాలు దక్కడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక నిన్నటి మ్యాచ్ లో వెస్టిండీస్ నడ్డి విరిచిన టీం ఇండియా మరో బౌలర్ బుమ్రా. గత కొంత కాలంగా అద్బుతమైన ఫామ్ లో ఉన్న బూమ్రా నిన్నటి మ్యాచ్ లో కూడా కీలకమైన రెండు వికెట్లను తీశాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. గత కొన్ని రోజులుగా ధోనీ ఆటతీరుపై వస్తున్న విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బుమ్రా ధోనీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో ధోనీ ఇన్నింగ్స్ వెలకట్టలేనిది. కొన్ని సందర్బాలో ధోనీ స్లోగా ఆడతారు. అలాంటి సందర్బంలో బంతులు వృదా అవ్వడం సహజమే. కాని కుదురుకున్న తర్వాత ధోనీ ఏ స్థాయిలో ఆడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలర్లకు అనుకూలిస్తున్న ఇలాంటి పిచ్ లపై ధోనీ 56 పరుగులు చేయడం మామూలు విషయం కాదని బూమ్రా అన్నాడు. ధోనీ చివరి వరకు క్రీజ్ లో లేకుంటే ఇంత స్కోర్ ఇండియాకు వచ్చి ఉండేది కాదేమో అనే అభిప్రాయంను బూమ్రా వ్యక్తం చేశాడు.Please Read Disclaimer