కేక పుట్టిస్తున్న విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్

0

ఈ ఏడాది క్రికెట్‌ను కొత్తగా ప్రారంభించేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. వెస్టిండీస్ సిరీస్ అనంతరం దొరికిన దాదాపు రెండు వారాల విశ్రాంతి అనంతరం ఫుల్‌గా రిచార్జీ అయిన కోహ్లీ.. తాజాగా తన హెయిర్ స్టైల్ మర్చాడు. సెలబ్రిటీ స్టైలిస్ట్ మొగుల్ హకీమ్ దగ్గర న్యూహెయిర్ స్టైల్ చేయించుకున్న కోహ్లీ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరలైంది.

న్యూ స్టైల్‌లో కోహ్లీ

నిజానికి కోహ్లీకి స్టైలింగ్‌కు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు దూసుకొచ్చే కొత్త స్టైల్‌ను అనుకరించడంలో తనకు పెట్టిందిపేరు. బాలీవుడ్, హాలీవుడ్‌కు దీటుగా కోహ్లీ స్టైల్‌ను ఫాలో అయ్యేవారున్నంటే అతిశయోక్తి కాదు.

కొత్త సవాలుకు సిద్ధం

తాజాగా సెలబ్రిటీ స్టైలిస్ట్ హకీమ్ వద్ద కొత్తగా స్టైలింగ్ చేయించుకున్న కోహ్లీ ఆ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతకుముందు వాటిని హాకీమ్ పోస్టు చేశాడు. కటింగ్‌కు ముందు, వెనక ఉన్న విరాట్ పొటోలను ఇందులో పొందుపర్చారు.

గువాహటిలో తొలి టీ20

మరోవైపు కొత్త ఏడాదిని పొట్టి ఫార్మాట్‌తో ప్రారంభించేందుకు భారత్ సిద్ధమైంది. శ్రీలంకతో ఆదివారం నుంచి గువాహటిలో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తర్వాతి రెండు మ్యాచ్‌లు ఇండోర్‌, పుణేలో జరుగుతాయి.

అసోంలో ఆందోళనలు..

ఇక సిరీస్‌కోసం లంక ఇప్పటికే గువాహటి చేరుకుంది. నిజానికి పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్‌ఆర్‌సీ చట్టాలపై అసోంలో చాలా రోజుల నుంచి ఆందోళనలు సాగుతున్నాయి. ఈక్రమంలో మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు ఏర్పడ్డాయి. తాజాగా అసోంకు లంక చేరినా.. భారత్ గువాహటి చేరిక ఖరారయ్యేదాక దీనిపై తకరారు నెలకొంది.

టీ20లపై ఫోకస్

ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో దానికోసం టీమిండియా ఫుల్లుగా సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం ఎక్కువగా పొట్టిఫార్మాట్‌పైనే ఇండియా ఫోకస్ పెట్టింది.

ధోనీ భవిష్యత్తుపై ఉత్కంఠ

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొనసాగడంపై ఈ ఏడాదే స్పష్టత రానుంది. రాబోయే ఐపీఎల్ ముగిశాక వరల్డ్‌కప్ జట్టును ప్రకటించనుండడంతో ఐపీఎల్లో సత్తాచాటి జట్టులోకి రావాలని ధోనీ అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer