భారత ప్రభుత్వ సంచలన నిర్ణయం – టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్స్ నిషేధం

0

చైనాతో తాడో పేడో తేల్చుకోవడానికే మనదేశం నిర్ణయం తీసేసుకుంది. వరుసగా పడుతున్న అడుగులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. ఇంతకాలం చైనా వంటి పెద్ద దేశంతో పెట్టుకోవడానికి కాస్త వెనుక ముందు వేసిన మోడీ సర్కారుకు కోవిడ్ రూపంలో అవకాశం వచ్చింది. దీంతో ప్రపంచంలో అత్యధిక దేశాలు చైనాకు వ్యతిరేకంగా ఇండియా సరసన నిలబడనున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా చైనాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.

తాజాగా భారత్ 59 చైనా మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశపు సార్వభౌమత్వాన్ని కాపాడే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్ 69 ఎ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (పబ్లిక్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ని అడ్డుకోవటానికి ప్రొసీజర్ అండ్ సేఫ్ గార్డ్స్) నిబంధనలు 2009 నిబంధనల ప్రకారం 59 యాప్స్ ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చైనా బెదిరింపుల యొక్క స్వభావం దృష్ట్యా భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత భారతదేశం యొక్క రక్షణ రాష్ట్ర భద్రత ప్రజా క్షేమం కోణంలో పరిశీలన చేసినపుడు చైనా పక్షపాతపూర్వక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న కీలక సమాచారం దృష్ట్యా దేశ ప్రజలకు ముప్పుగా ఉన్న 59 యాప్స్ నిషేధిస్తూ బహిరంగ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఎవరైనా వాడాలనుకున్నా ఈ యాప్స్ అందుబాటులో ఉండవిక. ప్రభుత్వం నిషేధించిన యాప్స్ లో టిక్ టాక్ షేర్ ఇట్ వీగో వీడియో హలో యుసి న్యూస్ వంటివి కూడా ఉన్నాయి.
Please Read Disclaimer