మరో వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

0

క్రికెట్ ప్రపంచలోని రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై తన కన్నేశాడు. శ్రీలంకతో శుక్రవారం పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో జస్ట్ ఒక్క పరుగు చేస్తే చాలు మరో వరల్డ్ రికార్డు తన పేరిట నమోదవుతుంది. ఇండోర్‌లో జరిగిన గత మ్యాచ్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌ రికార్డును కోహ్లీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

శుక్రవారం మ్యాచ్ విషయానికొస్తే ఒక్క పరుగు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్‌గా 11వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలువనున్నాడు. ఇప్పటికే ఈ ఘనతను ఐదుగురు సాధించారు. అయితే శుక్రవారం మ్యాచ్‌లో కోహ్లీ తన ఖాతాను ఓపెన్ చేస్తే చాలు అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా నిలుస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు కెప్టెన్‌గా ఆడిన అన్ని మ్యాచ్‌లు కలిపి 10,999 రన్స్ చేశాడు.

మరోవైపు లంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంతో తిరుగులేని స్థితిలో నిలిచింది. గువాహటిలో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కాగా.. ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌ను ఏడు వికెట్లతో భారత్ నెగ్గింది. శుక్రవారం మ్యాచ్‌లో భారత్ గెలిస్తే లంకపై మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. 2008లో కోహ్లీ అరంగేట్రం చేశాక ఇరుజట్ల మధ్య జరుగుతున్న 19వ సిరీస్ ఇది కావడం విశేషం. అయితే వీటిలో 16 సిరీస్‌లను భారత్ కైవసం చేసుకుంది. రెండింటిలో ఫలితం రాలేదు.
Please Read Disclaimer