మొసలి మెడలోని ఈ టైరును తీస్తే నజరానా, మీరు సిద్ధమేనా?

0

ఇండోనేషియాలో ఓ మొసలి మెడకు టైరు చుట్టుకుంది. దాన్ని ఎవరైతే తొలగిస్తారో.. వారికి మాంచి నజరానా ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వామ్మో.. ఇది చాలా రిస్క్ కదా అనుకుంటున్నారా? రిస్క్ కాబట్టే అక్కడి ప్రభుత్వం బహుమతి ప్రకటించింది.

ఒక్క మొసలి కోసం ప్రభుత్వం కలవరపడుతుందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ముందుగా ఆ మొసలి గురించి తెలుసుకోవల్సిందే. 2016లో ఇండోనేషియాలోని పాలు నదిలో తొలిసారిగా ఈ మొసలి టైరుతో కనిపించింది. దాన్ని పట్టుకుని టైరు తొలగించడం అధికారుల వల్ల కాలేదు.

2018లో పాలులో ఏర్పడిన భూకంపం, సునామీ తర్వాత ఈ మొసలి ప్రత్యక్షమైంది. అయితే, అప్పటికీ దాని మెడలో ఆ టైరు అలాగే ఉంది. దీంతో అధికారులు దాన్ని బంధించేందుకు ప్రయత్నించారు. చికెన్, మటన్ పెట్టి ఆకర్షించారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటి నుంచి ఆ టైరు అలాగే ఉండిపోయింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ మొసలిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంది. ఆ టైరు దాని మెడలో ఉండటం వల్ల ఏదో బిగుసుకుని చనిపోయే ప్రమాదం ఉందని, వన్య ప్రాణాలను బందించే అనుభవం ఉండే వ్యక్తులు దాన్ని పట్టుకుని టైరు నుంచి విముక్తి కల్పించాలని ప్రకటించింది. అయితే, నజరానాగా ఎంత చెల్లిస్తారనేది వెల్లడించలేదు.
Please Read Disclaimer