దేశంలో కరోనాకు ఇంజెక్షన్ మందు సిద్ధం

0

కరోనాతో ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతున్న వేళ మరో గుడ్ న్యూస్ వచ్చింది. అదీ దేశంలోనే కావడం విశేషం. తాజాగా కరోనాకు మందు సిద్ధం చేశామని ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో ప్రకటించడం విశేషం. ఇది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంస్థనే కావడం మనకు గర్వకారణంగా మారింది. కరోనా అనుమానితులు పాజిటివ్ రోగులైన చిన్నారులు యువతకు హెటిరో రూపొందించిన ‘కోవిఫర్’ అనే ఇంజక్షన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఈ హెటీరో చైర్మన్ డాక్టర్ బి. పార్థసారథి తెలిపారు. రెమిడిసివిర్ అనే పేరుతో తయారు చేసినా దీన్ని మార్కెట్లోకి ‘కోవిఫర్’ అనే పేరుతో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 100 మిల్లీ గ్రాముల ఇంజెక్షన్ రూపంలో దీన్ని అందుబాటులో ఉంచామన్నారు.

ఇప్పటికే ఈ హెటిరో కరోనా ఇంజెక్షన్ మందుకు భారత డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి కూడా పొందినట్లు తెలిపారు. గిలిడ్ సైన్సెస్ తో కుదుర్చుకున్న లైసెన్స్ ఒప్పందం ప్రకారం ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని హెటిరో చైర్మన్ తెలిపారు.

ముంబైకి చెందిన గ్లెన్ మార్క్ సంస్థ కూడా కరోనాను నయం చేసేందుకు ట్లాబ్లాయిడ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. యాంటివైరల్ డ్రగ్ ‘ఫవిపిరవిర్’ ను ఫ్యాబి ఫ్లూగా శనివారం ఆవిష్కరించింది. ఇప్పుడు అంతకంటే మెరుగైన ఇంజెక్షన్ రూపంలో హెటిరో తీసుకురావడం కరోనా చికిత్సలో ముందడుగుగా భావిస్తున్నారు.
Please Read Disclaimer