ఐసిస్ ఉగ్రవాదితో కాకి కామెడీ..వీడియో వైరల్

0

ఐసిస్ ఉగ్రవాదులు.. ఈ పేరు వింటే మధ్యప్రాచ్యం వణికిపోతుంది. ఇరాన్- ఇరాక్- యెమెన్ దేశాల్లో తిష్టవేసి దేశాలను కబలిస్తూ నెత్తుటి క్రీడ ఆడుతున్న ఈ ఉగ్రవాదులపై అమెరికా సహా ఆయా దేశాలు పోరాడుతున్నా వీరి ఉగ్ర చర్యలు అరికట్టడం లేదు. ఇతర దేశాలకు కూడా ఐసిస్ ఉగ్రచర్యలు పాకుతున్నాయి.

అమెరికా సహా విదేశీయులు తమ చేతికి చిక్కితే వారికి కాషాయం దుస్తులు వేసి గొర్రెను కోసినట్టు మెడను కోసే వీరి నరరూప రాక్షసత్వంపై ఎన్నో వీడియోలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి.

ఇక ఐసిస్ లాంటి పిచ్చి ఉగ్రవాద సంస్థలో చేరాలని హైదరాబాద్ సహా దేశంలోని చాలా మంది ముస్లిం యువత పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇలానే అబూ మహ్మద్ అల్ అదెనీ అనే కుర్రాడు కూడా ఐసిస్ లో చేరడానికి వెళ్లాడు. అయితే అందులో చేరలేకపోయాడు. యెమెన్ లోని కొన్ని ఉగ్రసంస్థల్లో చేరాడు. ఐసిస్ కు విధేయత ప్రకటిస్తూ ఒక వీడియోను తోటి జర్నలిస్టుల సాయంతో చేశాడు.

కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కాకి.. ఈ కుర్ర టెర్రరిస్ట్ మాట్లాడుతుంటే డిస్ట్రబ్ చేసింది. ఇతడు ఎంత గట్టిగా ప్రసంగం మొదలు పెట్టినా పక్కనే ఉండి కావ్ కావ్ అంటూ అరిచేసింది. దానికి డిస్ట్రబ్ అయిన అబూ మహ్మద్ చివరకు మరిచిపోయి జేబులోని రాసుకున్న దాన్ని తీసి చదివాడు. దీంతో ఈ వీడియో తీస్తున్న తోటి జర్నలిస్టులు తలలు పట్టుకున్నారు. ఎప్పుడో తీసిన ఈ వీడియోను తాజాగా అల్ కాయిదా సంస్థనే ప్రముఖ చానెల్స్ కు లీక్ చేసింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో మధ్యప్రాచ్య దేశాల నిపుణుడు డా. కెండాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. కరుడుగట్టిన ఉగ్రవాదిని ఓ కాకి చెడుగుడు ఆడిన వైనం ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది..
Please Read Disclaimer