Templates by BIGtheme NET
Home >> Telugu News >> బ్రేకింగ్ : యశోదా హాస్పిటళ్లలో ఐటీ సోదాలు!

బ్రేకింగ్ : యశోదా హాస్పిటళ్లలో ఐటీ సోదాలు!


ప్రస్తుత రోజుల్లో వైద్యం కూడా కార్పొరేట్ అయిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ రంగంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఉన్న డిమాండ్ ఇతర ఏ రంగానికి కూడా ఉండదు అన్న సంగతి తెలిసందే. కార్పొరేట్ వైద్యరంగంలో యశోదా హాస్పిటల్స్ కి ఓ విశేషమైన గుర్తింపుఉంది. అధునాతన టెక్నాలజీ తో వైద్యం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ నగరంలోని యశోద హాస్పిటళ్లలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. యశోద హాస్పిటళ్లలో అలాగే యశోద ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ ఐటీ శాఖ సోదాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 20 బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు.. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం. ఈ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉందని సమాచారం.