జగన్ సంచలనం: పేదలకు అమరావతి భూములు

0

గద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్ మరో పెను విప్లవాన్ని తీసుకొచ్చారు. అమరావతి పేరిట చంద్రబాబు పేద రైతులనుంచి లాక్కున్న భూములను అదే ఇళ్లు లేని పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జగన్ సర్కారు మంగళవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా సీఎం జగన్ కృష్ణా – గుంటూరు జిల్లాల్లో అర్హులైన పేదలకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి – పెదకాకాని – మంగళగిరి – దుగ్గిరాల తో పాటు విజయవాడ నగర పరిధిలో లోని అర్హులకు అమరావతి పేరిట చంద్రబాబు తీసుకున్న సిఆర్డీయే పరిధిలోని స్థలాలు కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ రెండు జిల్లాలోని అర్హులైన మొత్తం 54307 మందికి 1251.5 ఎకరాలు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు లెక్క తేల్చింది. లబ్ధిదారులకు నౌలురు – కృష్ణాయపలెం -నిడమర్రు – ఐనవోలు – కురగల్లు – మందడం లో భూములు కేటాయిస్తూ జగన్ సర్కారు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు చేసిన భూపందేరానికి చెక్ పడింది. పేదలకు ఇళ్ల స్తలాలు ఇచ్చి జగన్ నిరుపేదలకు న్యాయం చేసినట్టు అయ్యింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-