వైఎస్సార్సీపీ పై జనసేన ఫిర్యాదు?!

0

తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనుచిత ప్రచారం చేస్తున్నారంటూ జనసేన అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ బ్లాక్ మనీని వైట్ చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో జనసైనికులు పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు హైదరాబాద్ లో నమోదు కావడం గమనార్హం. సైబర్ క్రైమ్ పోలీసులకు జనసేన అభిమానులు ఈ ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మార్చారంటూ ప్రచారం చేస్తున్నారంటూ జనసేన వాళ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఈ ఫిర్యాదులోనే కొంత అస్పష్టత కనిపిస్తూ ఉంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఇటీవల కత్తి మహేశ్ పవన్ కల్యాణ్ మీద సంచలన పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో నూటా ముప్పై కోట్ల రూపాయల విలువ జేసే ఇంటిని కొనుగోలు చేసినట్టుగా కత్తి మహేశ్ పోస్టు చేశారు. అది వైరల్ గా మారింది. రకరకాల అభిప్రాయాలు వినిపించాయి.

దాని మీద జనసేన పెద్దగా రియాక్ట్ కాలేదు. అయితే పెద్దగా పాపులర్ కానీ ఈ బ్లాక్ మనీ –వైట్ మనీ గురించి మాత్రం ఫిర్యాదు చేసినట్టుగా ఉన్నారు. అయితే ఒకవైపు ఫిర్యాదు చేసినట్టుగా ఒక వర్గం ప్రకటిస్తుండగా – ఫిర్యాదును చేయబోతున్నట్టుగా మరో వర్గం అంటోంది. తమ పార్టీ పై జరుగుతున్న అనుచిత ప్రచారం పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయనున్నట్టుగా మరో ప్రకటన చేశారు. ఇంతకీ జనసేనకు ఏమిటో ఈ కన్ఫ్యూజన్!
Please Read Disclaimer