సీబీఐ-ఈడీలపై గాలి జనార్ధన్ రెడ్డి కౌంటర్ అటాక్!

0

ఇన్నాళ్లూ గాలి జనార్ధన్ రెడ్డి మీద సీబీఐ ఈడీలు వివిధ రకాల అభియోగాలతో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడాన్ని అంతా విన్నారు. అయితే ఇప్పుడు కథ రివర్స్ లో నడవనుందట. తన ఆస్తులను స్వాధీనంలో ఉంచుకుని తనకు అప్పగించకుండా వ్యవహరిస్తున్న సీబీఐ ఈడీలపై చట్టపరమైన చర్యలకు రెడీ అవుతున్నారట జనార్థన్ రెడ్డి.

ఈ వ్యవహారం ఆసక్తిదాయకంగా ఉంది. వెయ్యి కోట్ల రూపాయలకు పై స్థాయి విలువైన జనార్ధన్ రెడ్డి ఆస్తుల వ్యవహారం ఈ పరిణామం చోటు చేసుకోనంది. జనార్ధన్ రెడ్డి పై ఓఎంసీ మైనింగ్ లో అక్రమాలు అంటూ కేసులు పెట్టినప్పుడు ఈడీ భారీ ఎత్తున ఆస్తులను అటాచ్ చేసింది.

వాటి విలువ అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయల పైనే! వాటిల్లో గాలి జనార్ధన్ రెడ్డి సొంత హెలీకాప్టర్ కూడా ఒకటి ఉంది! అయితే ఆ విషయంపై జనార్ధన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తన ఆస్తులను ఈడీ అక్రమంగా అటాచ్ చేసిందని ఆయన ఆరోపించారు. దానిపై విచారణ జరిపిన కర్ణాటక హై కోర్టు వాటిని విముక్తి చేయాలని ఆదేశించింది.

ఆ ఆస్తులను జనార్ధన్ రెడ్డికి అప్పగించాలని పేర్కొంది. అయితే ఇప్పటి వరకూ ఆ ఆస్తులు జనార్ధన్ రెడ్డికి అప్పగించలేదట అధికారులు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారట. కోర్టు చెప్పి ఏడాది దాటి పోయినా తన ఆస్తులను తనకు అప్పగించకపోవడంపై జనార్ధన్ రెడ్డి ఈ విధంగా ప్రొసీడ్ కానున్నారట. తనను ఒక రేంజ్ లో ఇబ్బంది పెట్టిన ఈడీ- సీబీఐ లపై జనార్ధన్ రెడ్డి ఇప్పుడు ఇలా కౌంటర్ పిటిషన్లు దాఖలు చేస్తుండటం గమనార్హం!
Please Read Disclaimer