భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

స్థానిక ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

0

ఏపీలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటూ నామినేషన్లు.. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.. అభ్యర్థుల ఎంపికతో పాటూ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు జనసేన కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది.

స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు జిల్లాలవారీగా జనసేన సమన్వయకర్తల నియమించారు. నామినేషన్‌ దశ నుంచి పోలింగ్‌ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేసుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 13 జిల్లాలకు సమన్వయకర్తల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా : డాక్టర్‌ బి.రఘు
విజయనగరం జిల్లా : గడసాల అప్పారావు
విశాఖపట్నం (రూరల్‌) : సుందరపు విజయ్‌ కుమార్‌
తూర్పుగోదావరి జిల్లా : బొమ్మదేవర శ్రీధర్‌ (బన్ను)
పశ్చిమ గోదావరి జిల్లా : ముత్తా శశిధర్‌
కృష్ణా జిల్లా : పోతిన మహేశ్‌
గుంటూరు : వత్త కళ్యాణం శివ శ్రీనివాస్‌ (కె.కె.)
ప్రకాశం : షేక్‌ రియాజ్‌
నెల్లూరు : సి.మనుక్రాంత్‌ రెడ్డి
చిత్తూరు : బొలిశెట్టి సత్య
కడప : డా.పి.హరిప్రసాద్‌
కర్నూలు : టి.సి.వరుణ్‌
అనంతపురం : చిలకం మధుసూదన్‌ రెడ్డి

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నెల 12న మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో ఇరు పార్టీల ముఖ్య నాయకులు సమావేశమై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రెండు గంటల పాటు చర్చించారు. జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో ఇరు పార్టీ మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు నేతలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-