రైతన్నలను నిలువునా ముంచుతున్న జగన్ –జనసేన

0

భారీ మెజారిటీ తో ఎన్నికల్లో గెలిచినా తరువాత జగన్ ఇచ్చిన హామీలను, చేస్తున్న పనులను క్లుప్తంగా ఒకే ఒక్క ఫోటో ద్వారా జనసేన తన ప్రశ్నలని సంధించింది. అన్నదాత వ్యధ అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన జనసేన, జగన్ చేస్తున్న పనుల మీద ని కాకుండా, రైతన్నలకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టేందుకు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. జగన్ 100 రోజుల పాలన చూసాక ఎంతో మంది ఎన్నో విమర్శలు చేసినప్పటికీ ఒక్క జనసేన మాత్రమే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది. సమస్యపైనే యుద్ధం ప్రకటించే జనసేన జగన్ కి వేసిన ప్రశ్నలని ఇక్కడ చూద్దాం.

జహాన్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ, వ్యవసాయ రంగానికి పూర్తీ తోడ్పాటు, రైతులకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా పేరుతో ఎకరానికి 12, 500 రూపాయల పెట్టుబడి. ఇవి జగన్ ఇచ్చిన హామీలు, కాగా జగన్ చేసిన పనులని ప్రస్తావిస్తూ, వరదలను అదుపు చేయలేక పంటలను నీట ముంచటం, విత్తనాలను అందించలేక రైతుల ప్రాణాలను తీయడం, రైతులను కులాల వారీగా విభజించడం, రుణమాఫీని రద్దు చేయడం, 12, 500 కాకుండా ఎకరానికి 6,500 రూపాయలు మాత్రమే పెట్టుబడి. వడ్డీలేని రుణాలకు కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించడం. ఇవి జగన్ చేసింది. మరి ఇలానే ఉంటే జనాల్లో కుడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.