Jioకి చెక్ పెట్టే Vodafone రీచార్జ్ ప్లాన్ ఇదే.. ఎంతో తెలుసా?

0

టెలికాం రంగంలో ప్రస్తుతం పోటీ తారాస్థాయికి చేరుకుంది. వొడాఫోన్, జియో, ఎయిర్ టెల్ ల మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. వొడాఫోన్ అన్ లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్ రూ.169 నుంచి ప్రారంభం కానుంది. ఎయిర్ టెల్ కూడా అంతే. అయితే ఎయిర్ టెల్ రీచార్జ్ తో మీకు డేటాతో పాటు అదనపు లాభాలు కూడా లభిస్తాయి. వొడాఫోన్ మాత్రం అదనపు ప్రయోజనాల మీద దృష్టి పెట్టకుండా అధిక డేటాను అందించడంపై వొడాఫోన్ దృష్టి పెట్టింది. జియో తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన రూ.222 ఆల్ ఇన్ వన్ ప్లాన్ కి చెక్ పెట్టే ప్లాన్ వొడాఫోన్ దగ్గర ఉంది. అదే రూ.229 ప్లాన్. ఆ ప్లాన్ వివరాలివే..

వొడాఫోన్ రూ.229 ప్లాన్..
ఇది ఒక బోనస్ కార్డ్ అన్ లిమిటెడ్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. రోజుకు 2 జీబీ డేటా ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. దీంతో పాటు ప్రతీ రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా అందిస్తారు. దేశవ్యాప్తంగా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ను ఉచితంగా చేసుకోవచ్చు. ఇవే కాకుండా వొడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఉచితంగా లైవ్ టీవీ, సినిమాలు కూడా చూడవచ్చు. వొడాఫోన్ గతంలో అన్ని సర్కిళ్లకు అందుబాటులో ఉంచిన రూ.255 ప్లాన్ ను రద్దు చేసింది. ఈ రెండు ప్లాన్ల లాభాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి.

మరి జియో రూ.222లో ఏం ఉన్నాయంటే..
ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్రమే. ఇందులో కూడా రోజుకు 2 జీబీ డేటా అందిస్తారు. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. జియో నుంచి జియోకు కాల్స్ ఉచితం. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 నాన్ జియో ఉచిత నిమిషాలు అందిస్తారు. దీనికంటే వొడాఫోన్ ప్లాన్ ధర రూ.7 ఎక్కువ అయినా అన్ లిమిటెడ్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లతో పోటీ పడే ప్లాన్ దేన్నీ ఎయిర్ టెల్ ఇంతవరకు ప్రవేశపెట్టలేదు.

వొడాఫోన్ లో ఉన్న ఇతర ప్లాన్లు ఇవే..
ఇప్పుడు వొడాఫోన్ అందిస్తున్న ఆఫర్లన్నిటిలో అత్యంత ఆకర్షణీయ ప్లాన్ ఏంటే.. ‘Youth on Prime’ అనే ఆఫర్ అనే చెప్పాలి. ఈ ఆఫర్ కింద 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే.. రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ వారికి రూ.499కే లభిస్తుంది. ఈ ఆఫర్ ను పొందడం కోసం వారు మై వొడాఫోన్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ రూ.229 ఆఫర్ నచ్చకపోతే.. మీకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్, రూ.349 ప్లాన్, దీర్ఘకాలిక ప్లాన్ల కోసం చూస్తున్నట్లయితే.. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.509 రీచార్జ్ కూడా అందుబాటులో ఉంది.Please Read Disclaimer