జగన్ ఉండాల్సింది జనాల్లో కాదు.. జైల్లో: కేఏ పాల్

0

క్రైస్తవుడిగా ఉండి తిరుమలకు వెళ్లే వైఎస్ జగన్‌కు ఓటు వేయడం బైబిల్‌కు విరుద్ధమని అన్నారు క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. రాష్ట్రంపై గౌరవం ఉన్న వారెవరూ వైసీపీకి ఓటేయొద్దని పిలుపునిచ్చారు. తనపై దాడులు చేయిస్తోందని జగన్ గ్యాంగేనని, గతంలో బాలినేని శ్రీనివాసులురెడ్డితో కలిసి జగన్ తనను జైల్లో పెట్టించాడని పాల్ ఆరోపించారు.

జగన్ చెప్పే మాటలు ప్రజలు నమ్మొద్దని పాల్ కోరారు. జగన్ సీఎం అయితే రావణకాష్టంలా మారుతుందని అన్నారు. అలాంటి అవినీతిపరుడు జనంలో ఉండకూదడని, జైల్లో ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మామిడికాయలు పోతేనే కేసులు నమోదుచేసే పోలీసులు తమ పార్టీ ఆఫీసులో బీఫారాలు దొంగిలిస్తే పట్టించుకోవడం లేదని పాల్ ఆరోపించారు.