మహేష్ గారో.. వంటలక్క-కార్తీక్‌లను కలపండి ప్లీజ్.. ఇదెక్కడి గొడవరా ద్యావుడా!

0

కార్తీకదీపం.. బుల్లితెరను ఏలుతున్న సీరియల్ ఇది. కొత్త సినిమాలు టీవీలో వచ్చినా.. జబర్దస్త్, బిగ్ బాస్ లాంటి బడా ప్రోగ్రామ్‌లు వచ్చినా.. రేటింగ్స్‌లో సత్తా చాటేది మాత్రం కార్తీకదీపం సీరియల్ మాత్రమే. జాతీయ స్థాయిలో నెంబర్ వన్ సీరియల్‌‌గా 15.44 సరాసరి రేటింగ్‌తో బుల్లితెర బాహుబలిగా మారింది మన కార్తీకదీపం సీరియల్.

700 ఎపిసోడ్‌లు పూర్తి చేసిన కార్తీకదీపం.. టాప్ రేటింగ్‌తో బుల్లితెర బాహుబలి

మా టీవీలో రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం ఇంటిల్లిపాదీ ఎదురుచూస్తుంటారు. అయితే ఈ సీరియల్ గురువారం నాటితో 700 ఎపిసోడ్‌లు పూర్తి చేసి సత్తా చాటుతోంది. అయితే ఈ సీరియల్‌‌పై ప్రతి ఇంటిలోనూ చర్చ నడుస్తుండటంతో ట్రోలింగ్స్ కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.

వంటలక్క-డాక్టర్ బాబులను మీరే కలపాలి మహేష్ గారో..

కార్తీక్, దీపలు ఇంకెప్పుడు కలుసుకుంటారు.. మా దీప ఇంకెన్నాళ్లు ఇలా ఏడుస్తూనే ఉండాలి? ఇకనైనా దయతలచండి అంటూనే ఈ ఇద్దర్నీ కలిపే బాధ్యతను సూపర్ స్టార్ మహేష్ తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేంటి మధ్యలో మహేష్ బాబుకి ఏం సంబంధం అంటే..

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌లో చిరు-విజయశాంతి

ఎందుకు లేదు.. ఈ మధ్య మహేష్ బాబు విడిపోయిన జంటల్ని కలుపుతున్నారుగా… అప్పట్లో చిరంజీవి-విజయశాంతిలు 20 సినిమాలు తీసి హిట్ పెయిర్‌గా వెండితెరను ఓ ఊపు ఊపి తరువాత పొలిటికల్ గమ్యాలు వేరుకావడంతో బద్ధ శత్రువులయ్యారు. వీరిద్దరూ కలుసుకుని, మాట్లాడుకుని దాదాపు 15 ఏళ్లు పైనే అయ్యింది.. అయితే విడిపోయిన ఆ జంటను ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌లో ఒక్కటి చేశారు మహేష్ బాబు.

ఇన్నాళ్లకు కలిశాం అంటూ విజయశాంతికి హగ్ ఇచ్చిన చిరు

స్టేజ్ మీద విజయశాంతికి హగ్ ఇచ్చి.. మా ఇద్దర్నీ కలిపినందుకు థాంక్స్ మహేష్ అని మెగాస్టార్ చెప్పారుగా.. అలాగే కార్తీకదీపం సీరియల్‌లో మా వంటలక్కకు కూడా న్యాయం చేయండి.. డాక్టర్ బాబుతో కలపండి మహేష్ బాబుగారూ అంటూ ఫన్నీ పోస్ట్‌లు పెడుతున్నారు వంటలక్క ఫాలోవర్స్.

ఇంకెన్నాళ్లు కార్తీకదీపం..

అయితే కార్తీకదీపం సీరియల్ ఇష్టపడే వారి శాతంతో పాటు ఈ సీరియల్ బాధ్యులు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. ఈ సీరియల్ వస్తుంటే.. మా ఆడవాళ్లు మమ్మల్ని టీవీల దగ్గరకు కూడా రానీయడం లేదు రీమోట్‌ వాళ్ల చేతుల్లోకి వెళిపోతుందనే కంప్లైంట్‌లు చాలానే ఉంటుండగా.. మీరు ఎన్నాళ్లు తీసినా ఆ వంటలక్కా, డాక్టర్ బాబులు కలవరు.. వాళ్లు కలిస్తేనే కాని మా ఇంట్లో వాళ్లు అన్నం పెట్టేలా లేరు అంటూ కన్నీళ్లు కారుస్తున్న ఎమోజీలతో ఫన్నీ పోస్ట్‌లు పెడుతున్నారు.

మిగిలింది వంటలక్క, డాక్టర్ బాబే

మహేష్ బాబు పుణ్యంతో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిలు కలిసిపోయారు. ఇక మిగిలింది డాక్టర్ బాబు, వంటలక్కలు కలవడమే అంటూ ఫన్నీ పోస్ట్‌లు చేస్తున్నారు వంటలక్క అభిమానులు. మొత్తానికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌లో చిరు-విజయశాంతిలో కలిసి హగ్ చేసుకుంటే.. దాన్ని కార్తీకదీపం సీరియల్‌లోని వంటలక్క-డాక్టర్ బాబులకు అన్వయించి సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి ఈ మీమ్స్.
Please Read Disclaimer