కత్తి మహేష్ పై దాడి …కారణం అదేనా !

0

సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ గా మారిపోయాడు. గతంలో ఎన్నో వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఎన్నో విమర్శలని ఎదుర్కొన్నారు. అలాగే ఏడాది పటు నగర బహిష్కరణకు కూడా గురైయ్యారు. కానీ తన కత్తితో ఇంకా పదును తగ్గలేదు అంటూ తాజాగా మరోసారి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలతో తనదైన రీతిలో రెచ్చిపోయారు. కొన్ని రోజుల క్రితం .. రాముడు తన అంత:పురంలో ఉంపుడుగత్తెలతో సుఖించేవాడని ఆయనకు నెమలి తొడ అంటే ఇష్టమని.. సీత జింకను వండుకుని తినడం కోసమే ఆయన్ని అడవిలోకి పంపిందని ఎగతాళిగా మాట్లాడాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు కత్తి మహేష్ పై ఐమాక్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కొందరు దాడికి దిగారు.

ఈ రోజు హీరో విజయదేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా చూడటానికి కత్తిమహేష్ ఐమాక్స్ కి వచ్చారు. సినిమాకు వచ్చిన సంగతి తెలుసుకున్న కొందరు వ్యక్తులు బయట కత్తి కోసం కాచుకుని ఉన్నారు. ఆయన ఎక్కిన కారుపై దాడి చేసారు. దాంతో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి నుంచి కత్తి మహేష్ తృటిలో తప్పించుకున్నాడు. ఈయనకు ఎలాంటి గాయాలు కూడా కాలేదు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఐమాక్స్కు చేరుకుని కత్తి మహేష్ను అక్కడ్నుంచి సేఫ్ గా పంపించారు. కత్తి మహేష్ పై అటాక్ జరగడంతో అక్కడ కాసేపు ఉద్రికత్త వాతావరణం కనిపించింది. అయితే దాడి జరిగిన కాసేపటి తరువాత ఈ విషయంపైన కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ “నేను బాగానే ఉన్నాను.. కంగారు పడాల్సిన అవసరం లేదని” ఒక పోస్ట్ చేసారు. గతంలో కూడా ఓసారి కత్తిమహేష్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.
Please Read Disclaimer