త్వరలో అన్న ముఖ్యమంత్రి చెల్లెలు మంత్రి

0

తెలంగాణ ప్రభుత్వంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. ఆ మేరకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఇప్పుడు పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. దీనిలో మంత్రి సీఎం తనయుడు కేటీఆర్ ముద్ర స్పష్టంగా తెలుస్తోంది. కేసీఆర్ కుమారుడు విజయవంతంగా పరిపాలన చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాడు. తండ్రి ఆదేశాల మేరకు తారక రాముడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇక అన్ని కలిసొస్తే త్వరలోనే తెలంగాణ కు రెండో ముఖ్యమంత్రి గా యువ నాయకుడు ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే కుమారుడికి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కేసీఆర్ తన ముద్దుల తనయ కవిత భవిష్యత్ పై కూడా శ్రద్ధ పెట్టారు.

నిజామాబాద్ ఎంపీగా అనూహ్యంగా కవిత ఓటమి చెందారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా కవిత ఉన్నారు. మళ్లీ తన కూతురు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రం రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉండగా త్వరలోనే మరో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒక స్థానం కవితకు కేటాయించి రాష్ట్రంలోకి తీసుకు రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. కుమారుడు ముఖ్యమంత్రి అయితే కూతురి ని మంత్రిని చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీంతో అన్నకు చేదోడుగా చెల్లెలు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుంటే మళ్లీ కవితను త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానం కేటాయించి మళ్లీ ఢిల్లీకి పంపించే మరో ఆలోచన కూడా ఉంది.

వారిద్దరిని రాష్ట్ర రాజకీయాల్లోకి కీలకం చేసి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఎప్పటి నుంచి ఆశిస్తున్నారు. ఈ మేరకు ఇప్పుడు కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా ఆయన రాజ్యసభ సభ్యుడి గా వెళ్లడమో లేదా ఏ పదవి లేకుండా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నారు. దానికి సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని తలకెత్తుకునే అవకాశం ఉంది.
Please Read Disclaimer