టీవీ పులులకు షాకిచ్చిన కేసీఆర్

0

సాయంత్రం 7 గంటలైందంటే చాలు.. అన్ని పార్టీల నాయకులు టీవీ తెరల మీద కనపడుతారు. తమ తమ పార్టీల విధానాలను వివరిస్తారు. అయితే అందరూ మాటకారులు కాదు కదా.. అందుకే ఈ తేడా.. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత అంత బలంగా వాణి వినిపించే వాళ్లు కొందరే ఉన్నారు. కానీ వాళ్లు టీవీల్లో చర్చలకు రారు. పోనీ టీవీ వాళ్లు పిలిస్తే వెళ్లిన వారు సరిగ్గా టీఆర్ ఎస్ ప్రభుత్వ వాదనను వినిపించడం లేదు. ప్రజల ముందు టీవీల సాక్షిగా టీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ టీవీ స్పోక్స్ మెన్ ల వల్ల ఇరుకునపడుతోంది.

ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. నోరునోళ్లనే టీవీ చర్చల్లో పంపుదామని.. ఎవ్వరూ ఏ టీవీ వాళ్లు పిలిచినా చర్చలకు వెళ్లరాదని అల్టీమేటం జారీ చేశారట.. సరైన సమాచారం లేకుండా.. ఆధారాలు చూపించే కసరత్తు చేయకుండా టీవీల్లో చర్చలకు వెళుతూ టీఆర్ ఎస్ పరువు తీస్తున్న నేతలకు చెక్ పెట్టడానికి కేసీఆర్ రెడీ అయినట్టు సమాచారం.

ఎవరైనా అత్యుత్సాహంతో టీవీల్లో ఫోకస్ కావాలని చర్చలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే సస్సెండ్ చేస్తామని కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం. ఈ మేరకు ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది.

త్వరలోనే పార్టీ తరుఫున బలంగా వాణి వినిపించే నేతలను ఎంపిక చేసి వారికి టీఆర్ ఎస్ ప్రభుత్వ సమగ్ర సమాచారం ఇచ్చి టీవీల్లో చర్చలకు పంపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఇన్నాళ్లు టీవీ పులల వలే రెచ్చిపోయిన నేతలకు కేసీఆర్ చెక్ పెట్టినట్టైంది.
Please Read Disclaimer