కెంట్ కరోనా వేరియంట్ ప్రపంచాన్ని అంతం చేయబోతుందా .. నిపుణులు ఏంచెప్తున్నారు !

0

కరోనా వైరస్ మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకీ కొత్త కొత్తగా కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ మరింత విజృంభిస్తోంది. ఎలాంటి వ్యాక్సిన్లు మందులకు కట్టడి కాకుండా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే మ్యుటేషన్లతో కరోనావైరస్ తన స్పైక్ ప్రోటీన్లను మారుస్తూ అంతకంతకూ శక్తివంతవంతం తయారు అవుతుంది. కెంట్ లో మొదట బయటపడ్డ కరోనా వేరియంట్ ప్రపంచంలోనే ఆధిపత్య జాతిగా అవతరిస్తుందని యూకేలోని జన్యు నిఘా విభాగం అంచనా వేస్తోంది.

ఈ కొత్త వేరియంట్ దేశాన్ని కదిలించిందని రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని అంతం చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రొఫెసర్ షరోన్ పీకాక్ అంచనా వేశారు. కెంట్ వేరియంట్ ఇప్పటికే 50కి పైగా దేశాలలో వ్యాపించింది. మొట్టమొదట 2020 సెప్టెంబరులో ఆగ్నేయ ఇంగ్లాండ్ లో ఆవిర్భవించింది. ఆ తరువాతి నెలల్లో వేగంగా వ్యాప్తిచెందుతూ జనవరిలో యూకే అంతటా వ్యాపించింది. దాంతో కొత్త లాక్ డౌన్ నియమాలు అమల్లోకి వచ్చేశాయి. ప్రస్తుతం అందబాటులోకి వచ్చిన కరోనా టీకాలు కరోనావైరస్ మునుపటి లక్షణాల ఆధారంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు.

కానీ రానురాను ఈ కరోనా వైరస్ సరికొత్తగా రూపాంతరం చెందుతోంది. తన స్పైక్ ప్రోటీన్ లో మార్పులు తెచ్చుకుంటూ మహమ్మారిలా మారిపోతోంది. ఈ కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అనేది సైంటిస్టులు కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వైరస్ అంతగా శక్తివంతంగా మారుతుంది. యూకేలో అత్యవసర వినియోగానికి ఆమోదించిన కరోనా వ్యాక్సిన్లు దేశంలో ప్రస్తుతం ఉన్న వైరస్ వేరియంట్లపై బాగా పనిచేస్తున్నట్లు కనిపించాయి. రోజుకు దాదాపు 30000 కరోనా పాజిటివ్ పరీక్షలు నమోదవుతున్నాయి. ఇటీవలి వారాల్లో మరింత జన్యు విశ్లేషణ కోసం 5-10శాతం పాజిటివ్ టెస్టులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కొత్త రకం వేరియంట్లు టీకాను ప్రభావితం చేస్తాయా లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతాయనేది మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు.