మరో వైసీపీ ఎమ్మెల్యేకు వైరస్ పాజిటివ్

0

ఏపీలో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. గతవారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత రెండు మూడురోజులుగా 400కుపైగా కేసులు నమోదయ్యాయి. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు సిబ్బంది రాజకీయ నేతలకు వైరస్ టెన్షన్ తప్పడం లేదు. ప్రజా ప్రతినిధుల్ని ఈ వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యేకు పాజిటివ్ గా నిర్థారణ అయింది.

తాజాగా కర్నూలు జిల్లాలోని కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు గురువారం వైరస్ పాజిటివ్ గా తేలిందని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం నీరసంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అయితే వైరస్ లక్షణాలు ఉండటంతో.. వైరస్ పరీక్షలు నిర్వహించారని ఈ పరీక్షల్లో ఆయని కి వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. దీంతో కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు ఎమ్మెల్యేని తరలించినట్లు అధికారులు చెప్పారని తెలుస్తుంది. కాగా ఎమ్మెల్యే కు వైరస్ పాజిటివ్ రావడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు పలువురికి కూడా వైద్యులు వైరస్ టెస్టులు చేస్తున్నారు.