హంపి అద్భుతం చేసింది.. భారత్ లోనే తొలి మహిళ

0

కోనేరు హంపీ భారత్ లోనే ఏ మహిళా సాధించలేని ఘనతను సాధించింది. రష్యాలో జరుగుతున్న ఫిడె ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

2014లో విజయవాడ అబ్బాయి అన్వేష్ ను పెళ్లి చేసుకొని అప్పటివరకూ అప్రతిహతంగా కొనసాగించిన చెస్ కెరీర్ కు హంపీ బ్రేక్ వేసింది. సంసార జీవితంలో పడి మళ్లీ తిరిగి వస్తుందో రాదో అనుకుంటున్న సమయంలోనే 2018లో తిరిగి పునరాగమనం చేసింది. తొలి ఫిడె మహిళల గ్రాండ్ ప్రిలే విజేతగా నిలిచింది.

తాజాగా రష్యాలోని మహిళల ర్యాపిడ్ ప్రపంచ చాంపియన్ షిప్ లో ఫైనల్ లో ముగ్గురు ట్రై బేక్ అయ్యారు.అందులో మెరుగైన స్కోరు కారణంగా హంపీతో లీ టింగ్జీ టైటిల్ పోరులో తలపడ్డారు. హోరాహరీగా సాగిన పోరులో హంపి విజేతగా నిలిచి భారత్ నుంచి తొలి ర్యాపిడ్ చెస్ ప్రపంచ చాంపియన్ గా అవతరించింది. తొలి భారతీయ మహిళగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
Please Read Disclaimer