అమెరికా వీసా ఇవ్వలేదు.. భారత్ లో కుబేరుడయ్యాడు

0

టాలెంట్ ఉన్న ఐఐటీయన్లు ఇతరులు అమెరికా చెక్కేసి డాలర్ల వేటలో పడి వాళ్లు సంపాదించుకుంటున్నారు. వారి టాలెంట్ ను అమెరికా ప్రయోజనానికి వినియోగిస్తున్నారు. కానీ అదే భారతీయులు మన దేశం కోసం పనిచేస్తే ఇండియా ఎప్పుడో డెవలప్ అయ్యేదంటారు. అలాగే అయ్యాడు ఒక యువకుడు. అమెరికా హెచ్1బీ వీసా తిరస్కరించడంతో ఇండియాలోనే కంపెనీ పెట్టి అపర కుబేరుడు అయ్యాడు. 51000 కోట్ల సామ్రాజ్యాన్ని భారత్ లో స్థాపించాడు. కృషి పట్టుదల ఉంటే సాధ్యం కానిదీ ఏదీ లేదని నిరూపించాడు.

స్పాప్ డీల్ ఆన్ లైన్ సంస్థ వ్యవస్థాపకుడు కునాల్ బహల్ గురించే ఈ గతమంతా.. కునాల్ 2007లో అమెరికాలోని ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ లో తన 23వ ఏటనే ఉద్యోగం సంపాదించి ప్రోడక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు . అయితే అమెరికాలో ఉండేందుకు అవసరమైన హెచ్1బీ డాక్యుమెంట్లు కునాల్ కు లభించలేదు. అమెరికా దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ కు పనిచేసి గొప్ప ప్రొఫెషనల్ గా మారాలని చూసిన కునాల్ కలలు కల్లలయ్యాయి. ఢిల్లీకి తిరిగివచ్చాడు.

తన క్లాస్ మేట్ రోహిత్ బన్సాల్ తో కలిసి రెస్టారెంట్ వ్యాపారాల కోసం కూపన్లు అమ్మాలని అనుకున్నారు. అమెరికాలో ఈ వ్యాపారం బాగా జరిగేది. దీంతో అలా ఈ ఇద్దరు ఆన్ లైన్ ఈ కామర్స్ రంగంలోకి దిగారు. స్పాప్ డీల్ పెట్టి 51వేల కోట్ల సామ్రాజ్యాన్ని కునాల్ నెలకొల్పాడు.

అందుకే ఇప్పుడు హెచ్1బీ కోల్పోయి అమెరికా నుంచి తిరిగి వస్తున్న అందరికీ కునాల్ బన్సాల్ ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. టాలెంట్ ఉంటే అవకాశాలు కోల్పోయినా ఎక్కడైనా సాధించవచ్చని కునాల్ నిరూపించాడు.
Please Read Disclaimer